బీజేపీ - బీఆర్ఎస్ ల లగ్గం పిలుపు: పెండ్లికార్డు విడుదల చేసిన కాంగ్రెస్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బిజెపి ఒప్పందం ఉందని కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్, బిజెపిలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్, బిజెపిల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక పెళ్లి కార్డు విడుదల చేసింది. ఈ పెళ్లి కార్డులో తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో అంటూ పేర్కొంది.

కేసీఆర్ ఫాంహజ్ లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ- బీఆర్ఎస్ ల బంధాన్ని వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేసింది. 2023 సార్వత్రిక ఎన్నికలలో ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఇక పెండ్లికి నక్షత్రంగా కవితపై కరుణ నక్షత్రంలో బిజెపి బీఆర్ఎస్ పెళ్లి జరగనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.

 BJP-BRS relationship: Congress released wedding invitation!!

ఇక ఈ పెళ్లివేడుకకు మోడీ, కేసీఆర్ మరియు తెలంగాణమంత్రులు ఆహ్వానం పంపుతున్నారని, లగ్గం చేసేది కెసిఆర్ ఫామ్ హౌస్ లో అంటూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. లగ్గం వేడుక జరిగేది రాజకీయ బాగోతం వేసేవారి ఇంట అంటూ పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ, పెళ్లికి వచ్చిన వాళ్లను అర్సుకునేటోళ్లు కేటీఆర్, హారీష్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, అర్వింద్ అని పేర్కొంది.

ఇక బీజేపీ బిఆర్ఎస్ లగ్గాన్ని తెలంగాణ ప్రజలందరూ చూడాలంటూ పేర్కొంది. నాకు నువ్వు బీఆర్ఎస్.. నీకు నేను బిజెపి అంటూ లోపాయికారి ఒప్పందం మాది అని ఈ రెండు పార్టీలు ఒప్పందంపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ఇక పెళ్లిలో ఏడడుగులు వేయడం పైన ఆసక్తికరమైన అంశాలు పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

 BJP-BRS relationship: Congress released wedding invitation!!

మెదటిఅడుగు: నోట్ల రద్దుతో ఒకరికి ఒకరు మద్దతు
రెండోఅడుగు: కాళేశ్వరం కుంభకోణానికి మోడీ అండ
మూడోఅడుగు: పెట్రోల్, డిజీల్, గ్యాస్ పై ట్యాక్స్ ల కుంభకోణం
నాలుగోఅడుగు: ధరణితో తెలంగాణభూముల కుంభకోణం
ఐదోఅడుగు: లక్ష ఉద్యోగాలని కేసీఆర్.. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలని మోడీల నయవంచన
ఆరోఅడుగు: పేపర్ లీకేజీపై సిబిఐ ఎంక్వైరి వేయకపోవడం
ఏడోఅడుగు: బండి సంజయ్ అధ్యక్ష పదవి పీకేసి కిషన్ రెడ్డి చేతిలో పెట్టడం అంటూ పేర్కొంది.

ఇక ఈ పెళ్లికి బీఆర్ఎస్ కి బీజేపీ ఇస్తున్న కట్నం ఎంతో తెలుసా? అని పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ లిక్కర్ స్కాంలో కవితమ్మను అరెస్టు కాకుండా అభయం ఇచ్చినట్టు వెల్లడించింది. బీఆర్ఎస్, బీజేపీ మిత్రుల అభినందనలతో ఈ లగ్గం జరుగుతుందని, ఇది వీరి చీకటి ఒప్పందం అని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+