హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌‌లో అమిత్ షా పర్యటన.... సభ్యత్వ నమోదుకు హజరు

|
Google Oneindia TeluguNews

బీజేపీ చీఫ్, కేంద్రహోమంత్రి అమిత్ షా శనివారం హైదారాబాద్‌కు రానున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజారిటితో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీకైన ఎన్నికైన అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన రాక ప్రాధన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు.

అమిత్ షా షెడ్యుల్...

అమిత్ షా షెడ్యుల్...


శనివారం మధ్యహ్నాం 2.30 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు.అనంతరం ఎయిర్‌పోర్టులోనే సీఐఎస్ఎఫ్ అధికారులతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కేఎల్‌సీ ఫంక్షన్ హాల్లో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోంటారు. అక్కడి నుండి నేరుగా నోవాటెల్ హోటల్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ నేతల సమావేశంలో పల్గోనున్నారు. అనంతరం రాత్రీ 9 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.

తెలంగాణ నేతల్లో జోష్

తెలంగాణ నేతల్లో జోష్


ఇందులో బాగంగానే కోత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్‌షాకు పరిచయం చేయనున్నారు. తెలంగాణలో నాలుగు బీజేపీ పార్లమెంటరీ స్థానాలు కైవసం చేసుకోవడంతో రెట్టింపు ఉత్సహాంతో పనిచేస్తున్న నేతలు అదనంగా 40 సభ్యత్వ నమోదును చేయించాలనే ఆలోచనలో ఉన్నారు..2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలువురి పార్టీ నేతలను కూడ పార్టీలో చేర్చుకోనున్నారు.ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్ పలు ఏర్పాట్లను చేస్తున్నట్టు ప్రకటించాడు.

పార్టీలో చేరనున్న పలువురు నేతలు.

పార్టీలో చేరనున్న పలువురు నేతలు.


ఇప్పటికే తెలంగాణపై దృష్టి పెట్టామని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు..వచ్చే ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి అహ్వానిస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీజేపీలో తెలంగాణ నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ వేశారు..కాగా అమిత్ షా సమక్షంలో పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యతోపాటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ చేరే అవకాశాలు ఉన్నాయి.

English summary
BJP chief and Union Home Minister Amit Shah will arrive to Hyderabad on Saturday. In particular, he is coming to Hyderabad to launch the party membership program.after coming to power for a second term Amit Shah took over as Union Home Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X