వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాపై బీజేపీ అపర చాణిక్యం... మోడీ, అమిత్ షాల ఫోకస్ వెనుక బిగ్ రీజన్!!

|
Google Oneindia TeluguNews

కేంద్రంలోని బిజెపి ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? 2024 లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ దృష్టి సారించిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. అసలు బిజెపి దక్షిణాది రాష్ట్రంపై ఇంతగా ఫోకస్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి అన్నది ప్రస్తుత ఆసక్తికరంగా మారింది.

ఉత్తరాదిలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి

ఉత్తరాదిలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి

కేంద్రంలోని బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిలో కచ్చితంగా తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినప్పటికీ అక్కడ ఎస్పీ బలం పుంజుకుంది. అలాగే మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభ మసకబారింది. పదహారు కార్పొరేట్లలో సగం మంది మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ సహా విపక్షాల బలం పెరిగింది. ఇక రాజస్థాన్ లాంటి చోట్ల బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ మరియు ఢిల్లీలో బీజేపీకి అడ్డంకిగా మారింది.

దక్షిణాది రాష్ట్రాలలోనూ బీజేపీ పరిస్థితి ఇదే

దక్షిణాది రాష్ట్రాలలోనూ బీజేపీ పరిస్థితి ఇదే

మహారాష్ట్రలో, గ్రౌండ్ లెవెల్లో అధికారంపై బిజెపికి పూర్తిగా పట్టు లేదు. బీహార్‌లో నితీష్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అసలు భయం మాత్రం ఆర్జేడీ రూపంలోనే ఉంటుంది. ఇక పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అడుగడుగున బీజేపీని నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బిజెపి ఫోకస్ చేయాలని ఉన్నట్టు కనిపిస్తుంది. దక్షిణాదిలో చూస్తే కాషాయానికి కలిసొచ్చే ప్రాంతం కర్ణాటక తప్ప మరొకటి లేదు. ఎన్నికల వేళ తమిళనాడులో చీలిక వచ్చినా అన్నాడీఎంకేలో శశికళను అగ్రభాగాన నిలబెట్టి రాజకీయాలు నడిపే యోచనలో ఉన్నారు.

 తెలంగాణాపై బీజేపీ ఫోకస్ అందుకే

తెలంగాణాపై బీజేపీ ఫోకస్ అందుకే

ఇక ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించకపోతే, మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో తమకు ఇబ్బంది అన్న భావనలో బిజెపి అధినాయకత్వం ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై సర్వేలు చేయిస్తూ, నివేదికలు తెప్పించుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

తెలంగాణాలో అమిత్ షా పర్యటనల వ్యూహం .. పార్టీ గెలుపు కోసం

తెలంగాణాలో అమిత్ షా పర్యటనల వ్యూహం .. పార్టీ గెలుపు కోసం


ఇక హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రం పై పూర్తిగా దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పర్యటించాలని నిర్ణయించిన అమిత్ షా నెలలో రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అంటే వచ్చే ఏడాది మొత్తం తెలంగాణలోనే ఉండాలని అమిత్ షా నిర్ణయించుకున్నారని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కేసిఆర్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని బిజెపి అధినాయకత్వం సైతం భావిస్తోంది.

తెలంగాణాలో ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు

తెలంగాణాలో ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. విజయం సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు

ఇక పార్టీ నేతలకు సరైన దిశానిర్దేశం చేసి కాషాయ జెండా రెపరెపలాడేలా చూడాలన్న సంకల్పం లో ఉన్న బిజెపి అగ్రనేతలు ఆ దిశలో పని చేస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ అక్కడ ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఎన్నికలలో పోరాటం సాగిస్తుంది. ఈసారి ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలన్న బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపై ఫోకస్ పెట్టింది.ఇదే బీజేపీ ఫోకస్ వెనుక బిగ్ రీజన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
BJP will get less seats in the north in the upcoming Lok Sabha elections, this time it has focused on the southern state of Telangana. It is discussed that this is the reason behind Modi and Amit Shah's focus on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X