డీలా పడొద్దు.. దూకుడే ముఖ్యం.. అందుకే తెలంగాణా బీజేపీ బడా వ్యూహం!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే రాజకీయ పార్టీల వ్యూహాలు తాజా పరిణామాలకు తగ్గట్టుగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ధ్యేయంగా అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ రాష్ట్రంలోని ప్రతి చిన్న అవకాశాన్ని వచ్చే ఎన్నికలకు ప్లాట్ ఫామ్ గా ఉపయోగించుకుంటే బీఆర్ఎస్ కు చెక్ పెట్టడం కోసం బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

అయితే ఇటీవల కాలంలో బిజెపిలో అంతర్గతంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిజెపి శ్రేణులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. అంతేకాదు వచ్చే ఎన్నికలకు దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన చోట, పార్టీ శ్రేణులను డీలా పడేలా చేశాయి. ఈ క్రమంలోనే పార్టీ పరిస్థితిని గుర్తించిన బిజెపి అధినాయకత్వం దిద్దుబాటుకు రంగంలోకి దిగింది. డీలా పడాల్సిన అవసరం లేదని, దూకుడుగా ముందుకు వెళ్లడం ముఖ్యమని బిజెపి తేల్చి చెబుతోంది.

BJP

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయకేతనం ఎగరవేయడానికి కార్యకర్తలు కార్య క్షేత్రం లో ముందుకు సాగాలని బిజెపి అధినాయకత్వం సూచిస్తుంది.ఇక ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు మార్పు పైన కూడా స్పష్టత ఇచ్చేసింది. బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని బిజెపి అధిష్టానం స్పష్టం చేసింది. ఇక వివిధ నియోజకవర్గాలలో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులను ఉద్దేశించి కూడా స్పష్టత ఇచ్చింది అధిష్టానం.

అభ్యర్థుల విషయంలో సర్వేలు నిర్వహించి, సర్వేలో ప్రజల మద్దతు సాధించిన వారికే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు డీలా పడిన అందర్నీ ఉత్సాహ పరచడం కోసం బిజెపి తెలంగాణలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణా లో నాలుగు భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి బిజెపి ప్లాన్ చేస్తుంది .

BJP

ఈ సభలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులను తీసుకువచ్చి పార్టీ శ్రేణులలో జోష్ నింపడానికి బిజెపి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా దూసుకుపోవాలని బీజేపీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు సూచిస్తుం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+