మాధవీలత అడ్డంగా బుక్

Madhavi Latha: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 1 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

BJP Hyderabad MP candidate Madhavi Latha was booked

ఈ పరిస్థితుల మధ్య హైదరాబాద్ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలత వ్యవహారశైలి విమర్శలకు తెర తీసింది. పోలింగ్ స్టేషన్‌లో ఆమె వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో మాధవీలత ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలతో వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రంలో బురఖా ధరించి కనిపించిన ముస్లిం మహిళల ఓటరు కార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి బురఖాను తొలగించాలంటూ ఆదేశించారు.

ఓటరు గుర్తింపుకార్డులో ఉన్నది ఎవరో తెలియాలంటే బుర్ఖాను తొలగించాల్సిందేనంటూ ఆమె పట్టుబట్టారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాధవీలత ప్రవర్తించిన విధానం సరైంది కాదంటూ ఏఐఎంఐఎం నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవలంటూ డిమాండ్ చేశారు.

మాధవీలత ఉదంతంపై ప్రిసైడింగ అధికారి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ముస్లిం మహిళల పట్ల ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా, అనైతికంగా ప్రవర్తించినట్లు తేలడంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌లోని 171 సీ, 186, 505 (1)తో పాటు ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 132 కింద కేసులు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+