అరుణVsకేటీఆర్: టీడీపీపై తెరాసని నిలదీసిన బీజేపీ
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ మంగళవారం నాడు తెలంగాణ శాసన సభలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని నిలదీశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మంత్రి కేటీఆర్‌ల వ్యాఖ్యల పైన గందరగోళం చెలరేగింది.
నోరు మూసుకో అని డీకే అరుణ అన్నందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్, మహిళా సభ్యురాలి పట్ల మంత్రులు అసభ్యంగా ప్రవర్తించినందుకు తెరాస క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకున్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుంటూ.. క్షమాపణ చెబితే సరిపోతుంది కదా అని కాంగ్రెస్‌కు సూచించారు. ఈ దశలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు.

గవర్నర్ ప్రసంగం సమయంలో గందరగోళం చేశారని టీడీపీ సభ్యుల పైన సభాపతిగా కఠిన నిర్ణయం తీసుకున్నారని, సెషన్స్ మొత్తం సస్పెన్షన్ అంటే చాలా కఠిన నిర్ణయమన్నారు. వారు క్షమాపణలు చెప్పలేదని వారి పైన చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు ఈ సభ్యులు కూడా తమ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకోవాలని, వారికో న్యాయం, వీరికో న్యాయమా అని ప్రశ్నించారు. అనంతరం సభ్యులు క్షమాపణలు చెప్పారు.
తెలంగాణకు మేమెలా వ్యతిరేకమో కేసీఆర్ చెప్పాలి: కిషన్ రెడ్డి
సభలో ఎలాంటి ప్రకటన చేయకుండా సభలో జాతీయగీతాలాపన ఎలా మొదలు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ సభ్యులను ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలా వ్యతిరేకమో కేసీఆర్ కుటుంబం చెప్పాలన్నారు. జాతీయ గీతం ఆలాపన విషయంలో జరిగిన పొరపాటుపై సమగ్ర చర్చ జరగాలన్నారు.












Click it and Unblock the Notifications