టీఆర్ఎస్ నేతలు సంస్కారహీనులు.. కేసీఆర్ నీ డ్రామాలు కట్టిపెట్టు.. డీకే అరుణ వార్నింగ్
టీఆర్ఎస్ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ విమర్శించారు. నోటికి ఇష్టం వచ్చినట్లు కేంద్ర మంత్రులపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టాను రీతిలో మాట్లాడితే చూస్తూ కూరుకోమని హెచ్చరించారు. రైతులను ఆదుకోలేనప్పుడు సీఎంగా కేసీఆర్ ఎందుకని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీశారని ఆరోపించారు.

కేసీఆర్ డ్రామాలు కట్టిపెట్టు
తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామాలు ప్రజలు నమ్మేపరిస్థితుల్లో లేరని డీకే అరుణ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లతో రైతాంగాన్ని గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది ఖరీఫ్, రబీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్న 27 లక్షల టన్నుల ధాన్యం కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని కేంద్రమంత్రి షీయూష్ గోయల్ స్పష్టంగా తెలిపారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

తప్పులు మీరు చేసిన మాపై నిందలా..?
వచ్చే యాసంగి పంటపై కేంద్ర ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇచ్చిందని డీకే అరుణ పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ను యాసంగిలో ఇవ్వబోమని కేసీఆర్ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసి ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా టీఆర్ఎస్ నేతలు బీజేపీపై నేపం మోపుతున్నారని మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని డీకే అరుణ మండి పడ్డారు.

కేసీఆర్‌కి మతిస్థిమితం లేదు
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పయి.. సోయలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏది చెప్తే మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులకు గ్రౌండ్ రియాలిటీ తెలియదా? అని డీకే అరుణ ప్రశ్నించారు. తాను ఏం చేబితే అదే జరగాలన్న దోరణిలో నియంత్ర పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతులను మోసం చేయడం మానుకోవాలన్నారు.

గుణపాఠం తప్పదు
సీఎంగా కేసీఆర్ ఉండేది ఇక కొద్ది కాలమేనని.. ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేయాలని డీకే అరుణ కోరారు. టీఆర్ఎస్ మోసాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగాలేరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రతామ్నాయ పార్టీకి బీజేపీయే అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications