బీఆర్ఎస్ పై రూటు మార్చిన బీజేపీ - మోదీ మార్క్ స్కెచ్..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ లో పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ - బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. తమ బలం మరింత గా పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీలో ఇతర పార్టీల కీలక నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ నేతలకు ఢిల్లీ నుంచి దిశా నిర్దేశం అందుతోంది. దసరా నుంచి తెలంగాణ కేంద్రంగా కొత్త స్కెచ్ అమలుకు బీజేపీ నాయకత్వం సమాయత్తం అవుతోంది.

తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు... ప్రభుత్వం పైన క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ను బీజేపీ నాయకత్వం సేకరిస్తోంది. దీనికి అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. ఇతర పార్టీల్లోని ప్రజా బలం ఉన్న నాయకులను చేర్చుకోవడమే కాకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల తొమ్మిదిన ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. రాష్ట్ర నేతలతో ఈ నెల 10, 11 తేదీల్లో ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది.

bjp-leadership-focus-on-telangana-to-strengthen-the-party-here-the-details

బీఆర్‌ఎస్‌లో తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు వ్యూహాన్ని రూపొందించనున్నారు. బీఆర్‌ఎస్‌ బలహీనపడితే బీజేపీ పుంజుకునేందుకు పూర్తి అవకాశాలున్నాయని పార్టీ అగ్ర నేతలు యోచిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్ర కమిటీని నియమించి, తెలంగాణలో రాజకీయ కార్యాచరణను పూర్తిగా ఢిల్లీ నుంచే పర్యవేక్షణ చేపట్టాలని భావిస్తున్నారు. ఎంపీలకు, ప్రజా ప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పజెప్పడంతోపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు. అలాగే, ఆపరేషన్‌ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని, బీఆర్‌ఎస్‌లో ప్రజా బలం ఉన్న నాయకులను బీజేపీలోకి ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారు. దక్షిణాదిన తెలంగాణ తమకు ముఖ్యమైన రాష్ట్రమని చెబుతున్న నేతలు.. ఈ నెలాఖరులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+