శ్రీధర్ బాబుతో ఈటల రాజేందర్ భేటీ

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ శనివారం సచివాలయంలో కలిశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సమస్యల పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీధర్ బాబును ఈటల రాజేందర్ కోరారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్లు సరిగా లేవని, చెరువులు మురికి కూపాలుగా మారాయని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు ఈటల రాజేందర్. హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్ మెయిలర్లప దృష్టి సారించాలని మంత్రిని కోరారు. చిన్న దేవాలయాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.

BJP MP Etala Rajender meets Minister Sridhar Babu

హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా డంప్ యార్డులు ఉండాలని.. చెత్తంతా బాలాజీనగర్‌కు పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని మంత్రిని కోరారు ఈటల రాజేందర్. సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారిన ఈటల రాజేందర్ తెలిపారు.

తెలంగాణ పరిశ్రమలకు అనుకూలం

గ్లోబల్ ఇండియి బిజినెస్ ఫోరం(జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో పార్క్ హయత్‌లో నిర్వహించిన 'ఇండియా - లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్' రెండో ఎడిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను కోరారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మనకు మేలే చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకుని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు

తెలంగాణ పరిశ్రమలకు అనుకూలం

గ్లోబల్ ఇండియి బిజినెస్ ఫోరం(జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో పార్క్ హయత్‌లో నిర్వహించిన 'ఇండియా - లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్' రెండో ఎడిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను కోరారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మనకు మేలే చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకుని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+