35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల - లిస్టులో..!!

తెలంగాణలో బీజేపీ మూడో జాబితా విడుదల అయింది. 35 మంది అభ్యర్దుల జాబితాను బీజేపీ ప్రకటించింది. అంబర్ పేట నుంచి మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్, ఆంధోల్ నుంచి బాబు మోహన్ కు సీటు ఖరారు చేసారు. ఇప్పటికే 53 మందిని ఖరారు చేసిన బీజేపీ..ఇప్పుడు మలి విడత జాబితాలో పలు కీలక స్థానాలను ఖరారు చేసింది. జనసేనతో పొత్తు ఖాయం కావటంతో వారి సీట్లను ఇప్పటికే ఖరారు చేసారు. బీజేపీ విడుదల చేసిన జాబితాలో అభ్యర్దుల ఎంపిక ఆసక్తి కరంగా కనిపించింది.

బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 53 విడుదల చేయగా..ఇప్పుడు మరో 35 మందిని ఖరారు చేసింది. జనసేనకు 10-12 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ లిస్టులో సీనియర్లు..కొత్తగా చేరిన వారితో పాటుగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ జాబితాలో.మంచిర్యాల - వీరబల్లి రఘునాద్, ఆసిఫాబాద్ - ఆజ్మీరా ఆత్మారం నాయక్, బోధన్ - వీ మోహన్ రెడ్డి, బాన్సువాడ - ఎండ్ల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ రూరల్ - కల్చారి దినేష్, మంథని - చందుపట్ల సునీల్ రెడ్డి, మెదక్ - పంజా విజయ్ కుమార్, నారాయణ ఖేడ్ - జానేవాడే సంగప్ప, ఆందోల్ - బాబు మోహన్, జహీరాబాద్ - రామచంద్ర రాజ నర్సింహ, ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,ఎల్బీ నగర్ - సామా రంగారెడ్డి, రాజేంద్ర నగర్ - తోకల శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

BJP Releases 35 contesting Candidates names for Telangana Elections as Third list

చేవెళ్ల - కేఎస్ రత్నం, పరిగి - మారుతి కిరణ్, ముషీరాబాద్ - పూస రాజు, మలక్ పేట - సామిరెడ్డి సురేందర్ రెడ్డి, అంబర్ పేట - క్రిష్ణాయాదవ్, జూబ్లీ హిల్స్ - ఎల్ దీపక్ రెడ్డి, సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ - మేకల సారంగపాణి, నారాయణ్ పేట - రతంగ్ పాండు రెడ్డి, జడ్చర్ల - చిత్తరంజన్ దాస్, మక్తల్ - జలంధర్ రెడ్డి, వనపర్తి - అశ్వద్ధామ రెడ్డి, అచ్చంపేట - దేవని సతీష్ మాదిగ, షాద్ నగర్ - అందే బాబయ్య, దేవరకొండ -కే లాలూ నాయక్, హుజూర్ నగర్ - చల్లా శ్రీలతా రెడ్డి, నల్గొండ - మాదగాని శ్రీనివాస గౌడ్, అలేరు - పడాల శ్రీనివాస్, పినపాక - పోడియం బాలరాజు, పాలేరు - నున్నా రవికుమార్, సత్తుపల్లి - రామలింగేశ్వర రావును బీజేపీ తమ పార్టీ అభ్యర్దులుగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+