T BJP రెండో జాబితా - ఒక్క నియోజకవర్గానికే పరిమితం..!!
తెలంగాణ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కీలక నేతలు పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారుతోంది. పలువురు నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ రెండో జాబితా పైన కసరత్తు చేస్తోంది. బీజేపీ - జనసేన పొత్తు తెలంగాణలో దాదాపు ఖాయమైంది. ఇక, బీజేపీ రెండో జాబితా తర్జన భర్జన పడుతోంది. ఊహించని విధంగా కేవలం ఒకే అభ్యర్దితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.
బీజేపీలో కీలక పరిణామాలు : బీజేపీ తొలి జాబితా తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 52 మందితో ప్రకటించిన తొలి జాబితాపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమైన నేపథ్యంలో అధినాయకత్వం రెండో జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో మలి జాబితా ఆలస్యమయ్యేట్లు కనబడుతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా కేవలం ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్దిని బీజేపీ ప్రకటించింది. మహబూబ్ నగర్ అభ్యర్దిగా జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పేరును పార్టీ ప్రకటించింది. తొలుత ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ ఆలోచన చేసింది. అయితే, జితేందర్ రెడ్డి తాను ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పటంతో..ఇప్పుడు ఆయన కుమరుడు పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆచి తూచి ఎంపిక : ఈ సారి ఎన్నికల్లో బీసీ కార్డునే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ తొలి జాబితాలో ఆ సామాజిక వర్గం నుంచి ఏకంగా 17 మందికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితాలోనూ అలాంటి ప్రాధాన్యమే ఇస్తారని తెలుస్తోంది. బీజేపీ నేపథ్యమే అని మడి కట్టుకోకుండా నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి బీసీ నాయకులను వెతికి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులపై, ఇతర పార్టీల్లో పరిణామాల నేపథ్యంలో కొత్తగా వస్తున్న అభ్యర్థనలపై మరోసారి కసరత్తు చేసి, మిగతా 67 మంది అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరుకు ఖరారు చేస్తారని అంచనా వేస్తున్నారు. తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇచ్చారు. తొలి జాబితా ప్రకటన తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడారు.

జనసేనతో పొత్తు : మరి కొందరు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఇక,బీజేపీ-జనసేన పొత్తులపై రెండు పార్టీల అగ్రనేతల మధ్య చర్చలు జరుగనున్నాయి. జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తారనే విషయమై ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాతే, పార్టీ రెండో జాబితా ప్రకటిస్తారని చెప్పాయి. కనీసం 20 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు జనసేన గతంలో ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సెగ్మెంట్లతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని సరిహద్దు నియోజకవర్గాలను కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. జనసేనకు 5లేదా 6 ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉందని సమాచారం.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications