బీజేపీలో మేధావులు, విద్యావంతుల చేరికల వ్యూహం; తెలంగాణా కమలంపార్టీలోకి మాజీ ఐపీఎస్ అధికారి
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలలో ఉన్న బలమైన నాయకులను, పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూనే, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బిజెపి దృష్టిసారించింది. మేధావులు, విద్యావంతులను పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న బిజెపి ఆ విషయంలో సఫలీకృతం అవుతున్నట్లుగా కనిపిస్తుంది.

బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్రసాద్
తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణప్రసాద్ బీజేపీ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి కృష్ణ ప్రసాద్ 1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 2020లో పదవీవిరమణ చేసిన ఆయన పేదలకు సహాయం చేయడం ద్వారా సామాజిక సేవా సంస్థను నడుపుతూ దానికి అనుబంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. ప్రజాక్షేత్రంలో మంచి పేరున్న ఆయన బీజేపీ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మాజీ ఐపీఎస్ అధికారి ఆగస్టు 2వ తేదీన పార్టీలో చేరే అవకాశం
మాజీ పోలీస్ ఆఫీసర్ గా మంచి పేరున్న టి. కృష్ణ ప్రసాద్ కు, ఆయనకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీలో చేర్చుకోవడానికి సుముఖతను వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణప్రసాద్ నేడు బీజేపీలో చేరాల్సి ఉండగా, ఆయన ఆగస్టు 2వ తేదీన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు గా విశ్వసనీయ వర్గాల సమాచారం. టి. కృష్ణ ప్రసాద్ తో పాటుగా, పలు కీలక వ్యాపార సంస్థలకు సంబంధించిన కీలకమైన వ్యాపారవేత్తలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తుంది.

వివిధ శాఖలలో కీలకంగా పనిచేసిన మాజీలపై బీజేపీ ఫోకస్
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే చేరికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బిజెపి, పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయని చెబుతూ వస్తుంది. కానీ, ఇప్పటివరకూ ఆ స్థాయిలో చేరికలు జరిగింది లేదు. ఇక ప్రత్యర్థి పార్టీలలో ఉన్న కీలక నాయకులతో మంతనాలు జరుపుతున్న బిజెపి, త్వరలోనే భారీగా పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పడం ఆసక్తిని కలిగిస్తుంటే, ఇప్పుడు వివిధ శాఖలలో కీలకంగా పనిచేసిన మాజీ ఉన్నతోద్యోగులు బిజెపి బాట పట్టడం మరింత ఆసక్తికరంగా మారింది.

బీజేపీ చేరికల వ్యూహం .. బలోపేతం అవుతున్న బీజేపీ
ఏది ఏమైనా ఒకపక్క అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఢీ కొడుతూనే, ప్రజల్లోకి వెళుతూ వివిధ కార్యక్రమాలతో అధికార టీఆర్ఎస్ పై ఒత్తిడి తెస్తూనే మరోపక్క చేరికల వ్యూహంతో బిజెపి ముందుకు వెళుతున్న తీరు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఈసారి తెలంగాణా రాష్ట్రంపై గురి పెడుతున్న దృష్ట్యా తెలంగాణాలో బీజేపీ బలోపేతం అవుతుంది అన్న చర్చ జరుగుతుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications