కేసీఆర్ మతి చెడింది: ఉద్యోగులకు మద్దతంటూ, బండి సంజయ్ అరెస్టుపై ఏకిపారేసిన జేపీ నడ్డా

హైదరాబాద్: తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం జేపీ నడ్డాతోపాటు నేతలంతా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.

తెలంగాణలో నియంతృత్వ పాలన: జేపీ నడ్డా

తెలంగాణలో నియంతృత్వ పాలన: జేపీ నడ్డా

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడారు. తాను ర్యాలీ నిర్వహించవచ్చని, సభను కూడా సికింద్రాబాద్‌లోనే నిర్వహించవచ్చని.. కానీ, కరోనా నిబంధనలు పాటించి అక్కడ్నుంచి వచ్చేశామని తెలిపారు. కరోనా రూల్స్ పాటించాలని పోలీసులు నాకు చెప్పారని.. రూల్స్ పాటిస్తూనే గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పానన్నారు. ఎయిర్ పోర్ట్ లోనే ప్రభుత్వ తీరు బయటపడిందని తెలిపారు. అధికారులు అడ్డుకోవడంపైనే దృష్టిపెట్టారన్న నడ్డా.. తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తుందని.. ప్రజాస్వామ్య విరద్ధంగా పాలన నడుస్తోందన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ నేతలుగా మేం రూల్స్ పాటించామన్న జేపీ నడ్డా.... కరోనా పేరుతో సర్కార్ వాడుకుంటుందన్నారు.

పోలీసులు విధ్వంసం: బండి సంజయ్ అరెస్టుపై జేపీ నడ్డా ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలుపుంటే.. బీజేపీ కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకెళ్లి అరెస్టు చేశారన్నారు. కరీంనగర్ బీజేపీ ఆఫీసును ధ్వంసం చేసి సంజయ్‌ని అరెస్ట్ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ అరెస్ట్ కి నిరసనగా ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ కుటుంబపాలన సాగుతోందని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు.. కేసీఆర్ పాలన ఉందని ధ్వజమెత్తారు.

కేసీఆర్ ముసుగు తొలగిస్తామంటూ జేపీ నడ్డా నిప్పులు

తెలంగాణ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్ వచ్చినట్ల తెలిపారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందన్నారు. తెలంగాణలో మా పార్టీ ధర్మయుద్ధం చేస్తోంది. ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తాం. జాతీయ పార్టీగా కేసీఆర్ ముసుగు తొలగిస్తాం. బీజేపీ పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ నిర్ణయం వచ్చే వరకు సాగుతుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాన్ని రాష్ట్రమంతా చూపిస్తాం అని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ రెండు ఫలితాలతో కేసీఆర్‌కు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అత్యంత అవినీతి సీఎం అంటూ జేపీ నడ్డా విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటింలా మారిందన్నారు జేపీ నడ్డా. మొదట 30-50వేల కోట్లు అని... ఆ తర్వాత లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి, కేసీఆర్ తన ఫాంహోస్‌కు నీళ్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. ధర్నాచౌక్ వద్దన్న కేసీఆర్ ధర్నాచౌక్ దగ్గర ధర్నా చేశాడని గర్తు చేశారు. కరోనా విషయంలో గందరగోళం సృష్టించిన కేసీఆర్ మాటలను ఈ సందర్భంగా వీడియో రూపంలో చూపించారు. కేసీఆర్ అత్యంత అవినీతి ముఖ్మమంత్రి అని.. కేసీఆర్ మానసిన పరిస్థితి అదుపు తప్పిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+