తెలంగాణలో రేపట్నుంచే బీజేపీ విజయ సంకల్ప యాత్ర: మెజార్టీ ఎంపీ స్థానాలే టార్గెట్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు సిద్ధమైంది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలువడమే లక్ష్యంగా మంగళవారం నుంచి బీజేపీ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంది. వీలైనన్ని ఎక్కువ సీట్లతోపాటు హైదారాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యాత్రకు సంబంధించిన ప్రచార రథాలు గోడ పత్రికలు, కరపత్రాలను హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
జనసందేశ్ డిజిటల్ పత్రికను కూడా కిషన్ రెడ్డి ప్రారంభించారు. కాగా, కిషన్ రెడ్ సమక్షంలో బీజేపీలో చేరారు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర మంగళవారం (ఫిబ్రవరి 20న) నుంచి ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఐదు క్లస్టర్లుగా విభజించి 17 పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ నేతలతంతా విస్తృతంగా పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. విజయ సంకల్పయాత్రల్లో అస్సాం, గోవా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నట్లు చెప్పారు.
కాగా, సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది.
#WATCH | Telangana BJP Chief G Kishan Reddy says, "Telangana BJP will begin the Vijay Sankalp Yatras from five different points in the state. Each yatra will cover 3-to 4 parliament constituencies. Roadshows and meetings with self-help groups, artisans, women & farmers will be… pic.twitter.com/nCXlqAL73X
— ANI (@ANI) February 19, 2024
రేపట్నుంచి 4 యాత్రలు:
1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర
బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుంచి ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్లలో కొమరంభీం విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు జరుగుతుంది. 21 నియోజకవర్గాలల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.
2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర
కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. మిగిలిన నియోజకవర్గాలను కూడా కవర్ చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నామన్నారు.
3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులుతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్లలో ఈ యాత్ర సాగుతుంది.
4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర
సమ్మక్క సారక్క జాతర కారణంగా రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో 1,015 కి.మీ,7 రోజులు.. 21 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.
5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర
మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.
కాగా, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే విజయసంకల్ప యాత్రకు పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బాసర నుంచి ప్రారంభమయ్యే కొమరం భీం విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు.
Prayed to Goddess Bhagyalaxmi Ammavaru at the Bhagyalaxmi Temple in Charminar, Hyderabad, ahead of the flagging-off of the ‘Vijay Sankalp Yatra’ vans, along with
— G Kishan Reddy (@kishanreddybjp) February 19, 2024
Hon’ble MLAs’ and St leaders of @BJP4Telangana. pic.twitter.com/ALaMR9v3qy
వికారాబాద్ జిల్లా తాండూర్ లో ప్రారంభమయ్యే రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తారు. యాదాద్రి ఆలయం నుంచి ప్రారంభమయ్యే భాగ్యనగర విజయ సంకల్ప యాత్రను గోవా ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు.
కృష్ణా గ్రామంలో ప్రారంభమయ్యే కృష్ణా విజయ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారు. ఈ యాత్రలు సభలు మాత్రమే కాకుండా రైతులు, చేతి వృత్తులకు, నిరుద్యోగలు, పొదుపు సంఘాల వారితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ రోడ్ షోల ద్వారా ముందుకు వెళ్తుంది. బహిరంగ సభలు ఎక్కడా ఉండవు. అన్ని యాత్రలలో రోడ్ షోలు మాత్రమే ఉంటాయన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ప్రజామద్దతు కూడగట్టేందుకు తెలంగాణలో విజయసంకల్పయాత్ర చేపడుతున్నామని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారు తెలిపారు. #VijayaSankalpaYatra pic.twitter.com/xAuaSTlxP2
— BJP Telangana (@BJP4Telangana) February 19, 2024
5 యాత్రలు 5,500 కి.మీ ఉంటుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. 119 నియోజకవర్గాలలలో 114 నియోజకవర్గాలలో యాత్ర వెళ్తుంది.
మొత్తం 5 యాత్రలల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ ఉంటాయి. మార్చి 2వ తేదీ వరకు యాత్రలు పూర్తవుతాయి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన దేశంలో జరిగిన అభివృధ్ది, సంక్షేమ పథకాలు, సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు, దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు. ఎవరు ప్రధానిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందో నిర్ణయించే ఎన్నికలు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తం. గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అవినీతి, కుంభకోణాలను ప్రజలకు వివరిస్తం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలు...అవినీతి పార్టీలు, ప్రజలను మోసం చేసిన పార్టీలు అని కిషన్ రెడ్డి విమర్శించారు.
దేశంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నీతివంతమైన, అవినీతి రహిత పాలనను ప్రధాని నరేంద్ర మోడీ అందించారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టేందుకు విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాల ప్రారంభోత్సవం
— G Kishan Reddy (@kishanreddybjp) February 19, 2024
‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి… pic.twitter.com/IruANtYH0k
ఎన్నికల కోడ్ రాకముందే యాత్రను పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తం. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందుతున్న వారందరిని కలుస్తాం. ప్రతీ రైతు ఎరువుల మీద ఎకరానికి 20వేల లభ్ధి పొందుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా ప్రజలకు వివరిస్తామన్నారు కిషన్ రెడ్డి.
నరేంద్ర మోడీ పాలనలో ఉగ్రవాదాన్ని అణచివేశారు. దేశంలోని 543 పార్లమెంటు స్థానాల్లో 370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మెజారిటీ స్థానాలు గెలవడమే లక్ష్యం. ఇండియా కూటమి టెంట్లు కూలిపోతున్నాయి. కూటమి బద్దలైంది. దేశ ప్రజలంతా ఏకమై నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం అన్ని యాత్రలలో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. యాత్రలను విజయం చేయాల్సిందిగా.. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
మోడీ గారి నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో దూసుకెళ్తుంది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది.
ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణం, పేద ప్రజలకు 5కేజీల బియ్యం... అనేక నిర్ణయాలతో భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మద్దతు ఉందన్నారు కిషన్ రెడ్డి.












Click it and Unblock the Notifications