రైల్వే పోలీసులకు బాడీ కెమెరాలు... దొంగలకే కాదు రైల్వే పోలీసుల చేతివాటానికి చెక్

రైళ్ళలో చోరీలు, అసాంఘిక కార్యాకలాపాలు, రైల్వే సిబ్బంది , పోలీసులపై దాడులు నివారించటానికి రైల్వే ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహించే రైల్వే రక్షక దళ సిబ్బంది చొక్కాలకు కెమెరాలను అమర్చే విధానాన్ని కొత్తగాప్రవేశపెట్టింది . దీంతో ప్రయాణికులకు రక్షణ కల్పించాతంతో పాటు చోరీలు , దాడులు వంటి ఘటనలు జరిగితే నేరగాళ్ళను కెమెరా ఫుటేజ్ ఆధారంగా త్వరగా పట్టుకోవచ్చు .

రైళ్ళలో దారుణాలకు చెక్ పెట్టటానికి షర్ట్ కెమెరాలను అందిస్తున్న రైల్వే

రైళ్ళలో దారుణాలకు చెక్ పెట్టటానికి షర్ట్ కెమెరాలను అందిస్తున్న రైల్వే

రైళ్ళను చాలా మంది నేరస్తులు ఇప్పుడు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డలుగా మారుస్తున్నారు . రైళ్ళలో మానవ అక్రమ రవాణా మొదలుకుని గంజాయి, గుట్కా రవాణా , బంగారం స్మగ్లింగ్ వంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇక దొంగతనాలు, దోపిడీలు , మహిళలపై వేధింపులు లెక్కలేనన్ని చోటు చేసుకుంటున్నాయి. కొందరు కరడుగట్టిన నేరగాళ్ళు సిబ్బందిపైన కూడా దాడులకు పాల్పడుతున్నారు. తప్పించుకుని పారిపోతున్నారు. ఇక ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టటానికి బాడీ వోర్న్, షర్ట్ కెమెరాలను రైల్వే పోలీస్ సిబ్బందికి అందిస్తుంది రైల్వే శాఖ .

రైళ్ళలో నేరగాళ్లకు చెక్ పెట్టే యోచన ... చేతి వాటం చూపే పోలీసులకు చెక్ పెట్టే అవకాశం

రైళ్ళలో నేరగాళ్లకు చెక్ పెట్టే యోచన ... చేతి వాటం చూపే పోలీసులకు చెక్ పెట్టే అవకాశం

పెట్రోలింగ్‌ సమయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఈ కెమెరాల్లో సిబ్బంది రికార్డు చేస్తారు. రైళ్లలో దొంగతనాలు, ఇతర నేర సంఘటనలు జరిగినప్పుడు ఈ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించడం తేలికవుతుంది. అంతే కాదు చాలా సందర్భాల్లో ప్రయాణికుల వద్ద చేతివాటం చూపించే రైల్వే పోలీసులపై కూడా నిఘా ఉంచే అవకాశం అధికారులకు ఉంటుంది.

 తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే పలు స్టేషన్ లలో బాడీ వోర్న్ కెమెరాలు

తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే పలు స్టేషన్ లలో బాడీ వోర్న్ కెమెరాలు

ప్రస్తుతం రైళ్ళలో జరుగుతున్న అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డుకట్ట వెయ్యటానికి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పాల్గొనే పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది ఈ బాడీవోర్న్‌ కెమెరాలను ధరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు . తొలిదశలో కాచిగూడ, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, కర్నూలు, నిజామాబాద్‌ తదితర స్టేషన్ల రైల్వే రక్షక దళం సిబ్బందికి 18 కెమెరాలను అందజేశారు. సిబ్బంది చొక్కాకు ముందు భాగంలో వీటిని ధరించి రైళ్లలో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తారని హైదరాబాద్‌ డివిజన్‌ డీఆర్‌ఎం సీతారామ ప్రసాద్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+