హైఅలర్ట్ .. జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం ఘటనతో ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే కాకుండా.. మెడికల్ విద్యార్థులు సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కు చేరగా.. యావత్తు దేశాన్ని ఈ ఘటన కలిచివేసింది. ఈ విషాద ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే మరో విమానానికి బాంబు బెదిరింపులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం, బాంబు బెదిరింపు కారణంగా మధ్యలోనే తిరిగి వెనక్కి ప్రయాణించింది. భద్రతా కారణాల వల్ల తీసుకున్న ఈ చర్య ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. ఇది ఆదివారం మధ్యాహ్నం 2:14 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:44కి) ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సింది.

అయితే సుమారు రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం ఇంకా భారత గగనతలంలోకి రాకముందే బాంబు బెదిరింపు సమాచారాన్ని అందుకున్న అధికారులు, అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. దీంతో ఆదివారం సాయంత్రం 5:30 (IST ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో) విమానం మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎల్‌హెచ్ 752 అనే విమానం బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ మోడల్‌కి చెందినది.
కాగా మొదట్లో, లుఫ్తాన్సా అధికార ప్రతినిధులు ఈ విమానం హైదరాబాద్ ల్యాండింగ్ అనుమతి పొందలేదని వెల్లడించినా.. తర్వాత భారత అధికారులు స్పష్టంగా బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానం వెనక్కి మళ్లించబడిందని వెల్లడించినట్టు స్పష్టం అవుతోంది. ఫ్లైట్ మళ్లించిన అనంతరం, విమానాన్ని అధికారుల ఆధీనంలోకి తీసుకొని పూర్తి భద్రతా పరిశీలన చేపట్టారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications