బోనాల పండగ స్పెషల్.. 'బీసీ'లకు గుడ్ న్యూస్.. జూన్ 25 నుంచే ప్రారంభం..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని కులాల వారికీ పథకాలను అందిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. అయితే బోనాల పండగ నేపథ్యంలో వెనుకబడిన కులాలవారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లో బోనాల పండగ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో "చేతివృత్తులకు చేయూత" అనే పేరుతో రాష్ట్రస్థాయి ప్రదర్శన జరగనుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఐదు రోజులపాటు ట్యాంక్ బండ్ వద్ద ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

చేతివృత్తులకు చేయూత పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో కుమ్మరులు తయారు చేసిన మట్టి పాత్రలు, గౌడన్న ల నీరా స్టాల్, మేదరి వారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసల వారు తయారు చేసిన సామగ్రి, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తులు, ఇతర బీసీ వర్గాలు తయారు చేసిన కళాకృతులతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు వచ్చి చేతుల వృత్తుల వారికి చేయూతనివ్వాలని కోరారు.

Bonala Festival Extravaganza BC Welfare Dept Hosts Exhibition at Tank Bund

చేతివృత్తులవారు తయారు చేసిన వస్తువులతోపాటు తెలంగాణ సంప్రదాయంలోని నోరూరించే తెలంగాణ వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు, బెస్త సోదరులు వండిన సంప్రదాయ చేపల వంటకాలతోపాటు సేంద్రీయ ఉత్పత్తులు, ఇతర భోజన స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి 29 వరకు ఐదు రోజులపాటు ట్యాంక్ బండ్ వద్ద ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని వివరించారు. సందర్శకులకు ఎలాంటి టికెట్ లేదని ప్రవేశం ఉచితం అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+