Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్.. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం!

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే విశేషమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా ఆషాడమాసంలో బోనాల జాతరను నిర్వహించడం ప్రభుత్వ ఆనవాయితీగా వస్తుంది. ఇక ప్రస్తుతం 2025 సంవత్సరానికి సంబంధించి ఆషాడం బోనాల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

బోనాల పండుగ షెడ్యూల్
ఈ షెడ్యూల్ ప్రకారం బోనాల పండుగను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 26వ తేదీన గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయి. అదే రోజున గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పిస్తారు. ఇక అక్కడినుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే లష్కర్ బోనాలు జూలై 13వ తేదీన ప్రారంభమవుతాయి.

Bonalu Jatara schedule announced by Telangana govt first bonam to Golconda Jagadambika Ellamma

లష్కర్ బోనాలు ఎప్పుడంటే
లష్కర్ బోనాలను రెండు రోజులపాటు నిర్వహిస్తారు. లష్కర్ బోనాలలో బోనాలు ముగిసిన మరుసటి రోజు రంగం నిర్వహించే ఆనవాయితీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది.
ఇక జూలై 24వ తేదీన హైదరాబాద్ బోనాలు ముగుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పోతరాజుల విన్యాసాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో హైదరాబాద్లో చాలా ఘనంగా ఆషాడం బోనాలు నిర్వహిస్తారు.

తెలంగాణా వ్యాప్తంగా బోనాల జాతర
ఈ బోనాల పండుగ సందర్భంగా మహంకాళిని పూజించి, గ్రామదేవతలకు నైవేద్యాలను సమర్పిస్తారు. ఒక్క హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో బోనాల జాతర జరుగుతుంది. మట్టికుండలో బోనాన్ని వండి అమ్మవారికి నివేదిస్తారు. భక్తిశ్రద్ధలతో మహంకాళి అమ్మవారిని పూజించి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ప్రార్థిస్తారు.

ఘనంగా బోనాల పండుగ జరుపనున్న ప్రభుత్వం
గతంలో హైదరాబాద్లో ప్రజలు ప్లేగు వ్యాధి బారిన పడినప్పుడు మహంకాళి దేవి కటాక్షంతో ప్రజలు ప్లేగు నుండి బయటపడ్డారు. అప్పట్నుంచి అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలను సమర్పించి ప్రజలను చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం బోనాల పండుగకు షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం ఘనంగా నిర్వహించటం కోసం ఏర్పాట్లు చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+