బాలుడ్ని కిడ్నాప్ చేసి అమ్మేశాడు: బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని నెక్లెస్‌రోడ్‌లో కిడ్నాపర్ బాలాచారిని పోలీసులు పట్టుకున్నారు. బాలుడిని అమ్మేసినట్లు బాలాచారి పోలీసుల విచారణలో వెల్లడించాడు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో నిన్న 14 నెలల బాలుడు పృథ్వి కిడ్నాప్‌కు గురయ్యాడు.

బాలుడి కిడ్నాప్‌పై మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాలుడిని తమ బంధువు బాలాచారి అపహరించినట్లు ఆరోపించారు. ఘటనా స్థలంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలాచారి కిడ్నాప్‌కు పాల్పడినట్లు నిర్ధారించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Boy Prithvi kidnapped and sold

ఇదిలావుంటే, సికింద్రాబాదులోని బోరబండ వద్ద రైలు కిందపడి బీ పార్మసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడు భార్గవ్‌నాయుడుగా గుర్తించారు.

కుత్బుల్లాపూర్‌లో ఉండి కండ్లకోయలోని కళాశాలలో భార్గవ్ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. భార్గవ్ ఆత్మహత్యపై కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్, కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమంటూ ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+