రాహుల్.. అంత ధైర్యం ఎక్కడిది? కేటీఆర్ ప్రశ్న- బీఆర్ఎస్ ర్యాప్ సాంగ్..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో భారత్ సదస్సు నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు నాయకులు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విపక్ష బీఆర్ఎస్ (BRS) ఓ ర్యాంప్ సాంగ్ విడుదల చేసింది. కాంగ్రెస్ అమలు చేయని హామీల్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన ర్యాప్ సాంగ్ వైరల్ అవుతోంది.
తెలంగాణ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో నిర్వహిస్తున్న కాంగ్రెస్ సభలో పాల్గొనేందుకు మీరు హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రజలు మీ నుంచి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారంటూ రాహుల్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. మూడేళ్లు గడిచిపోయాయి, మరి ఆ 420 హామీలు ఏమయ్యాయి? అని ఇందులో ప్రశ్నించింది. కేవలం ప్రసంగాలు చేయడానికి మాత్రమే కాదు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధమై రావాలని కోరింది. ఈ ట్వీట్ కు జతగా రాహుల్ ను ఇవే ప్రశ్నలతో తయారు చేసిన ఓ ర్యాప్ సాంగ్ ను లింక్ చేసి షేర్ చేసింది.

రాహుల్ గాంధీకి హైదరాబాద్‌కు స్వాగతం పలికే శైలిలో రూపొందించిన ఈ పాట ద్వారా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 'ఆరు హామీలు' , ఇతర కీలక ఎన్నికల వాగ్దానాల గురించి బీఆర్ఎశ్ ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా 100 రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తామని ఇచ్చిన మాట, మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, రూ. 4,000 పింఛను వంటి అంశాలను ఈ రాప్ పాటలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ఇచ్చింది. ఈ హామీలను నెరవేర్చడంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈ పాట, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రస్తుత పరిస్థితి ఏమిటో వివరించాలని రాహుల్ గాంధీని కోరింది.

राहुल गांधी जी,वादे सारे हवा हो गए, कहाँ चले?तेलंगाना पूछे सवाल, जवाब कौन दे?Dear @RahulGandhi Ji,As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers.You made promises. Three years later, where are the 420 guarantees?Come prepared to answer, not just to address!
— BRS Party (@BRSparty) November 13, 2026
మరోవైపు బీఆర్ఎస్ నేత కేటీఆర్ విడిగా మరో ట్వీట్ చేసారు. ఇందులో మీరు వాగ్దానం చేసిన ఉద్యోగాలు డిమాండ్ చేస్తున్న విద్యార్థులను కాంగ్రెస్ పోలీసులు గొంతు పిసికి, కొడుతున్నప్పుడు మీరు రాలేదన్నారు, లగచర్ల గిరిజన మహిళలను వారి భూముల కోసం కొట్టి, వికృతంగా చేసి, లైంగికంగా వేధించినప్పుడు మీరు చలించలేదన్నారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజల ఇళ్లను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నప్పుడు మీరు ఢిల్లీలో నిద్రపోతున్నారన్నారు. కంచ గచ్చిబౌలి హెచ్‌సియు భూముల్లో రాత్రికి రాత్రే 10,000కు పైగా చెట్లను నరికివేసి, జింకలు, నెమళ్లతో పాటు గొప్ప పర్యావరణ వ్యవస్థను నాశనం చేసినప్పుడు గానీ, కేబీఆర్ పార్కును ధ్వంసం చేస్తున్నప్పుడు గానీ మీకు సమయం లేదని రాహుల్ పై విమర్శలు గుప్పించారు. అవసరమైన సమయంలో మీరు మౌనంగా ఉన్నారు! ఇప్పుడు మాత్రం, తెలంగాణ ప్రజల సొమ్ము 100 కోట్ల రూపాయలతో ప్రచార విన్యాసం కోసం సిగ్గులేకుండా ఇక్కడికి వచ్చేశారన్నారు. రాహుల్ గాంధీ, మీకు అంత ధైర్యం ఎలా వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.














Click it and Unblock the Notifications
