BRS నేతలతో కేసీఆర్ భేటీ - రాజీనామా, బస్సు యాత్ర పై కీలక నిర్ణయం..!?

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ లో తాజా పరిణామాలు.. నిర్ణయాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పరిణామాలతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. తాజా పరిణామాల వేళ కేసీఆర్ కీలక భేటీకి నిర్ణయించారు. కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న వేళ.. సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం.

తెలంగాణ తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఒత్తిడిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని మరింతగా ఫిక్స్ చేసే కార్యాచరణ కు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని.. ఆయన రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ నిరసనలు ప్రారంభించారు. మహా ధర్నా నిర్వహణ దిశగా ఈ రోజు ముఖ్య నేతలు భేటీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రేపు (ఆదివారం) భేటీ కానున్నారు. ఎర్రవెల్లిలో ఆదివారం మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ కానున్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి వెయ్యి రోజులైనా.. హామీలు అమలు చేయకపోవడం, పాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.

 సురేఖ స్థానంలో కేబినెట్ లోకి రాములమ్మ, ఢిల్లీ డెసిషన్ - అక్కడే అసలు ట్విస్ట్..!!
సురేఖ స్థానంలో కేబినెట్ లోకి రాములమ్మ, ఢిల్లీ డెసిషన్ - అక్కడే అసలు ట్విస్ట్..!!
brs-chief-kcr-likely-to-take-big-decisions-in-party-legislature-meeting-directions-for-party-leader

కేసీఆర్ నిర్ణయాల పై పార్టీలో ఉత్కంఠ

అదే విధంగా తన పైన సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఫిక్స్ చేయనున్నారు. రాజీనామా డిమాండ్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో పలు మార్లు రాజీనామా ద్వారా కేసీఆర్ మరింత బలోపేతం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే అంశం పైన పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇక.. కేసీఆర్ బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ రెండు కీలక అంశాల పైన కేసీఆర్ ఈ భేటీలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటే... ఏ విధంగా స్పందించాలో కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో.. అసెంబ్లీ సమావేశాల వేళ.. ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+