కాంగ్రెస్ లో కీలక పరిణామాల వేళ కేసీఆర్ అనూహ్య నిర్ణయం ..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం.. అధికార పార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లో తాజా ఘటనలను తమకు అనుకూలం గా మలచుకొనేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అటు సీఎం రేవంత్ ప్రతిపక్షాల ను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ నాయకత్వం తెలంగాణ కేంద్రంగా కొత్త వ్యూహాల అమలుకు సిద్దమైంది. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నారేళ్లు పూర్తి కావటంతో ఇక రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు.
కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. కొంత కాలంగా మాజీ సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు మాత్రమే క్రియాశీలకం గా వ్యవహరిస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తరువాత కేసీఆర్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. అటు బీజేపీ సైతం రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలం పెంచుకునే వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. కాగా, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మళ్లీ జనాల్లోకి రావాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపేందుకు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు త్వరలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్దమయ్యారు. అందుకోసం రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. డిసెంబర్ తరువాత బస్సు యాత్ర ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. అదే సమయంలో సీఎంగానే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

కేసీఆర్ బస్సు యాత్ర.. ముహూర్తం ఫిక్స్
కాగా, ఇప్పటికే కేటీఆర్ సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తండ్రీకొడుకులు ద్విముఖ వ్యూహంతో ఒకేసారి జనంలోకి వెళ్లటానికి సిద్ధమవటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాత్రల షెడ్యూల్‌పై త్వరలోనే స్పష్టత రానుందని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కొంత కాలంగా సీఎం రేవంత్ ప్రతీ సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అటు బీజేపీ సైతం కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. రెండున్నారేళ్ల రేవంత్ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పార్టీ నేతలతో తాజాగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక..తాను ప్రతీ జిల్లాలో పర్యటించి పార్టీ కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తానని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచాలని యోచిస్తున్నారు. దీంతో.. కేసీఆర్ తాజా నిర్ణయం రాష్ట్రంలో రాజకీయంగా కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications