శానా దినాలైంది- తులం బంగారం ఎప్పుడిస్తారయ్యా
BRS: తెలంగాణలో అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ పథకాలను అమలు చేయడానికి అవసరమైనంత నిధులు బడ్జెట్‌లో కేటాయించలేదంటూ ఇప్పటికే భగ్గుమంటోన్న భారత్ రాష్ట్ర సమితి.. తన పోరును మరింత తీవ్రతరం చేసింది.
తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై ఇదివరకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఏ ఒక్క రంగానికి సమగ్ర బడ్జెట్ కేటాయింపుల్లేవంటూ ఆయన గతంలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఇక వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించినట్టేనని ఆరోపించారు.

ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇక గోవింద.. గోవిందా..అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఆరు గ్యారంటీల ఊసే బడ్జెట్‌లో లేదని, వాటి గురించి మరిచిపోయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇచ్చిందనేది బడ్జెట్ ప్రతిపాదనలతో స్పష్టమైందని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చి,వాళ్లతో ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మహిళలు హతాశులయ్యేలా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయింపుల్లేవని అన్నారు.
వృద్ధులకు ప్రతి నెలా 4,000 రూపాయల పింఛన్ కోసం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలేవని, 500 రోజుల తరువాత కూడా 4,000 పింఛన్ మొత్తం అమలు కావట్లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇక 4,000 రూపాయల పింఛన్ ఇక రాదనే విషయం వృద్ధులకు అర్థమైందని చెప్పారు.
సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి..
— BRS Party (@BRSparty) March 26, 2025
కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ❓
శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన జ్వాలలు 🔥
♦️హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి
♦️కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల… pic.twitter.com/FAHq2BXqyX
ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి, కవిత, ఇతర సభ్యులు శాసన మండలి ఆవరణలో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ప్లకార్డులను పట్టుకుని ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ లేదు.. తులం బంగారానికి దిక్కు లేదు.. మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. సోనియా గాంధీ సోనా కహా హై.. అంటూ ప్రశ్నించారు. పఅనంతరం మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి మరీ ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చారని, అవి ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా- పెళ్లి చేసుకుంటున్న యువతులకు 10 గ్రాముల బంగారం ఇస్తామంటూ నమ్మించిందని, అధికారంలోకి వచ్చాక మోసగించిందని విమర్శించారు.
తమ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల చెక్కును ఇచ్చామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ- ఈ హామీని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఈ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తులం బంగారం కోసం ఎంతోమంది ఎదురు చూస్తోన్నారని అన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications