కేటీఆర్ చేతికి అరెస్ట్ వారెంట్..
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
లిక్కర్ స్కామ్‌లో పేరు..
కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో రెండు మూడుసార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కూడా. ఆ తరువాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నోటీసులు అందాయి.

అయిదు గంటల పాటు
కాగా- సుమారు అయిదు గంటలకు పైగా సాగిన సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. తొలుత ఆమెకు అరెస్టు నోటీసులను అందజేశారు. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్ట్ విషయాన్ని ఈడీ ఉన్నతాధికారులు ధృవీకరించినట్లు సమాచారం.
ఢిల్లీకి తరలింపు..
కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. అక్కడి ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తారని చెబుతున్నారు. ఢిల్లీకి తరలించి మరింత సమాచారాన్ని సేకరించాలనే ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
మాజీ పీఏ స్టేట్‌మెంట్ కీలకం..
ఈ కేసులో కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ స్టేట్‌మెంట్ కీలకంగా మారినట్లు చెబుతున్నారు. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగానే ఈడీ అధికారులు దూకుడు పెంచారని అంటున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాల గురించి కవితను ప్రశ్నించారని తెలుస్తోంది. వాటిపై ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడమే ప్రధానంగా అరెస్టుకు దారి తీసినట్లు సమాచారం.

ఇంటి వద్ద ఆందోళనలు..
ఈడీ అధికారులు సోదాలకు దిగినట్లు సమాచారం అందిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకున్నారు. ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలకు దిగారు. ఆమె ఇంటి వద్దే బైఠాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినదించారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె ఇంటి వద్ద భారీగా బందోబస్తును మోహరింపజేశారు.
కవిత ఇంటికి..
కవిత అరెస్ట్ అయ్యారనే వార్తలు తెలిసిన వెంటనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. ఆమె ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికే మరో మాజీ మంత్రి టీ హరీష్ రావు, మరికొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కవిత ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. అధికారులు వారిని అక్కడే అడ్డుకున్నారు. కొంత వాగ్వివాదం తరువాత కేటీఆర్, హరీష్ రావు ఇంట్లోకి వెళ్లగలిగారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన కేటీఆర్.!#KTR #MLCKavitha #KalvakuntlaKavitha #ED #DelhiLiqourScam #DelhiLiquorPolicyCase #Kavitha #EnforcementDirectorate #Telangana #Oneindiatelugu pic.twitter.com/VTXB2ywnqs
— oneindiatelugu (@oneindiatelugu) March 15, 2024
కేటీఆర్ వాగ్వివాదం..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఆమెను ఎలా అరెస్ట్ చేయగలిగారంటూ కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. విచారణ ముగిసిందని, ఆమెను అరెస్ట్ చేస్తోన్నామని ఈడీ అధికారి భానుప్రియ మీనా స్పష్టం చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా? అంటూ ప్రశ్నించారు.
ఉద్దేశపూరకంగానే..
ఉద్దేశపూరకంగానే.. శుక్రవారం రోజు వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మళ్లీ సోమవారం వరకు కోర్టులు అందుబాటులో ఉండవని తెలిసే ఈ అరెస్ట్ చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈడీ అధికారులకు ఇబ్బందులు తప్పబోవని హెచ్చరించారాయన. ట్రాన్సిట్ వారంట్ అనేది లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications