KTR: ఆ ఇంట్లో కేటీఆర్ దంపతులు లేరు.. స్పష్టం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఏ2 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఉండడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఆదివారం రాత్రి జన్వాడలోని రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఇందులో పురుషులకు డ్రగ్స్ టెస్ట్ చేశారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కేటీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకత డైవర్ట్ కావడానికి రేవ్ పార్టీ ఇష్యూలోకి కేటీఆర్‌ను లాగాలన్నారు. రాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్ దంపతులు లేరని వివేకానంద చెప్పారు. కేటీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఆదివారం కేటీఆర్ నాచారం లోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగేళ్లు సుస్థిరంగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. సుద్దపూస ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడో అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల చేసిన పనితో బీఆర్ఎస్ చిక్కుల్లో పడింది. ముఖ్యంగా కేటీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. సొంత బామ్మర్ది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంతో పార్టీలో కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications