Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ లిక్కర్ కేసు: సుప్రీంకోర్టులో కవిత మరో రిట్ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో మంగళవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు.

తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆమె చెప్పుకొచ్చారు.

brs mlc kavitha writ petition in supreme court for cancel remand in delhi liquor case

పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు కవిత తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని, ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో వివరించారు. కాగా, కవిత ఈడీ కస్టోడియల్ విచారణ మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు విచారించారు.

గతంలో వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్​ పిటిషన్‌​ను మంగళవారం వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని భావించి ఉప సంహరించుకున్నట్లు ఆమె తరఫు లాయర్ తెలిపారు. కాగా,
ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీంను ఆశ్రయించారు.

సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని, ఈ మేరకు ఎన్​ఫోర్స్‌​మెంట్​ డైరెక్టరేట్(ED)​ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌​పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. మార్చి 24న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పుడు వాయిదా పడి, చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్‌​పై విచారణ జరిగింది.

ఈ రిట్​ పిటిషన్​‌పై అప్పటికే ఈడీ కెవియట్​ పిటిషన్​ దాఖలు చేయడంతో రెండింటిపై సుప్రీం విచారించింది. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం​ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సంవత్సర కాలంగా కోర్టులో నలుగుతున్న ఈ పిటిషన్‌​పై మార్చి 15న మరోమారు విచారించింది సుప్రీంకోర్టు. ఇరువురి తరఫు న్యాయవాదుల సుధీర్ఘ వాదనల అనంతరం నేటికి(మార్చి 19కి) వాయిదా వేసింది. మంగళవారం మరోసారి దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

అయితే ఈ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్​ కావడంతో ఈ రిట్​ పిటిషన్​‌పై విచారణ అవసరం లేదని భావించిన కవత తన పిటిషన్​‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పిటిషన్ ఉప సంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ బెంచ్‌ అనుమంతిచారని చెప్పారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+