కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. బీఆర్ఎస్ లోనూ!!

రాజకీయాలలో ఏ పార్టీ అయినా కొన్నిసార్లు అధికారంలో, కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉండక తప్పదు. అయితే అధికారంలో లేకపోతే పార్టీ శ్రేణులు అభద్రత భావానికి గురవుతాయి. అయితే అది కొంతవరకు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వింత పరిస్థితి చోటు చేసుకుంది. కీలక నాయకులందరూ ఫిరాయింపులను ఆశ్రయిస్తున్నారు. పార్టీలో ఉండలేనంత బిఆర్ఎస్ శ్రేణుల అభద్రత భావానికి కారణాలేంటి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

అభద్రత భావానికి సవాలక్ష కారణాలు
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు బీఆర్ఎస్ శ్రేణులలో అభద్రత భావానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి అధికారంలో లేదు కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమను టార్గెట్ చేసి ఇబ్బంది పెడతాయి అనే భావన. ఈ భావనతో చాలామంది సేఫ్ జోన్ లోకి వెళ్లాలని పార్టీ మారుతున్నారు.

brs ranks insecurity these are the reasons for huge defections

అభద్రతా భావాన్ని పెంచిన కేసులు
మరొక కారణం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు బి ఆర్ ఎస్ శ్రేణుల అభద్రతాభావాన్ని మరింత పెంచాయి. ఈ కేసులలో అధినేత కుటుంబ ఇరుక్కుంటే తమ పరిస్థితి ఏమిటి? తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్నది? ఆలోచిస్తున్న చాలామంది కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. అవకాశాన్ని బట్టి జంప్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి వార్నింగ్స్ తో టెన్షన్
ఇంకా మరో ముఖ్యమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టను అని పదే పదే చెప్పడం.. జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే, జైల్లో చిప్పకూడు తినాల్సిందే అని కెసిఆర్ ఫ్యామిలీకి హెచ్చరికలు జారీ చేస్తున్న తీరు బి ఆర్ ఎస్ శ్రేణులకు ఆందోళన కలిగిస్తుంది. కెసిఆర్ ను రేవంత్ రెడ్డి కచ్చితంగా వదిలిపెట్టడు అని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు, అన్ని బాగా ఉన్నప్పుడే సేఫ్ జోన్ లోకి వెళితే మంచిదని పార్టీ ఫిరాయిస్తున్నారు.

brs ranks insecurity these are the reasons for huge defections

అవకాశవాద రాజకీయం
ఇక లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో అవకాశాల కోసం కొందరు, అధికార పార్టీలోకి వెళితే పదవులు వస్తాయని కొందరు, అవకాశవాద రాజకీయాల్లో భాగంగా పార్టీ మారుస్తున్నారు. అయితే గతంలో అధికారాన్ని కోల్పోయిన ఏ పార్టీలోనూ ఇంత ఎక్కువ అభద్రతాభావం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు బీఆర్ఎస్ లో తీవ్ర ప్రకంపనలకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+