ఔను.. వాళ్లిద్దరూ ట్విట్టుకున్నారు.! ఎండాకాలానికి మించి వేడెక్కిన తెలంగాణ రాజకీయం.!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం రాజకీయ పార్టీల మద్య దుమారం లేపుతోంది. ట్విట్టర్ వార్ కు దారి తీస్తోంది. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ మద్య ట్వీట్ల తూటాలు పేలుతున్నాయి. ఎంపీల దొంగ సర్టిఫికేట్ల వ్యవహారం నుండి, పరీక్ష పేపర్ లీకేజ్ వరకూ గులాబీ, కమలం పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటూనే ఉన్నాయి.
బీజేపి పార్టీలోని కొంత మంది ఎంపీలు ఇతర రాష్ట్రాల నుండి ఉన్నత చదువులు చదువుకున్నట్టు దొంగ సర్టిఫికేట్లు సృష్టించుకుని ఎంపీలుగా చెలామణి అవుతున్నారని మంత్రి కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేసారు. దానికి బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. సీఎం చంద్రశేఖర్ రావుకు సంబందించిన ఎంఏ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ చూపించగలరా అని సవాల్ విసిరారు. దీంతో సర్టిఫికేట్ల రాజకీయం ఒక్క సారిగా ముదిరిపోయింది.

అంతే కాకుండా పదవ తరగతి హింది పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి బాద్యత వహించాలని బీజేపి డిమాండ్ చేసింది. పరీక్షలను కూడా పకడ్బంధీగా నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. పరీక్ష పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయో, ఎవరి ప్రయోజనాలకోసం లీక్ చేస్తున్నారో అంతా తనకు తెలుసని సంచలన ప్రకటన చేసారు బండి సంజయ్. దీంతో రాజకీయంగా తెలంగాణలో ప్రకంపనలు రేగాయి.
అందులో భాగంగా మంగళవారం అర్థరాత్రి బండి సంజయ్ ని సోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందుతుల జాబితాలో బండి సంజయ్ పేరును కూడా చేర్చారు పోలీసులు. దీంతో వ్యవహారం మరింత ముదిరి పాకానపడినట్టయ్యింది. ఇక కేంద్ర బీజేపి పెద్దలు కూడా జరుగుతున్న వ్యవహారాల మీది ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. బీజేపి జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమీత్ షా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications