కాళేశ్వరంపై రగడ.. అసలు శనీశ్వరుడు ఆయనే!

కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రగడ కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపైన సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కేటీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలు వెరసి తెలంగాణ ప్రజలలో పెద్ద చర్చ మొదలైంది.

తెలంగాణ రాష్ట్రానికి అసలు శనీశ్వరులు ఎవరన్న చర్చ?
కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అన్న ప్రస్తుత పాలకులు శనీశ్వరులని మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అటు బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి అసలు శనీశ్వరులు ఎవరన్న చర్చ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ PCఘోష్ విచారణ సంఘం నివేదికపై అర్ధరాత్రి దాటేంతవరకు జరిగిన చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం ఇస్తూ, ఈ విషయాన్ని CBIవిచారణకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు.

brs vs congress on kaleshwaram commission report who is shanishwara in telangana

కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లక్ష కోట్లు కొల్లగొట్టాలని దురుద్దేశంతో జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని కమిషన్ నివేదిక చెప్పిందన్నారు. ఆంధ్ర పాలనలో అన్యాయం జరిగిందని, తెలంగాణను తెచ్చుకున్నామని, ఇప్పుడు ఏనుగులను పీక్కు తినేవాళ్ళు పోయి, పీనుగులను పీక్కు తినేవాళ్ళు తయారయ్యారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరి మీద కేసులు పెట్టాలి? ఎవరికి శిక్ష పడాలి? మీరే చెప్పాలంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

రేవంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన ఎస్ఎల్బీసీ ఘటన, సుంకిశాల ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటన, వట్టెం పంప్ హౌస్ లో మోటర్లు మునిగిపోయిన ఘటన, పెద్దవాగు కొట్టుకుపోయిన ఘటనలను గుర్తు చేసి ఎవరి మీద కేసులు పెట్టాలంటూ ఎదురు దాడి చేశారు.

చెత్తబుట్టలో వేసేందుకే పనికొచ్చే కాళేశ్వరం రిపోర్ట్: కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ మీద కదా కేసులు పెట్టాలి అంటూ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రానికి శని పట్టిందన్నారు. రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు వారేనని హరీష్ రావు చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరంను మేము కాపాడుకుంటాం అంటూ ప్రకటన చేశారు. మీరు ఇచ్చిన రిపోర్టులు చేత్తబుట్టలో వేయడానికి మాత్రమే పనికొస్తాయని అన్నారు.

కాళేశ్వరం రగడతో కొత్త చర్చ
సభలో మాట్లాడటానికి టైం కూడా ఇవ్వకుండా కావాలని మీ నాయకులు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, కాబట్టి బురదజల్లే క్రమంలోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇక రెండు పార్టీల తీరు చూసి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టిన స్వలాభం ధ్యేయంగా పని చేస్తాయని చర్చిస్తున్నారు.

ప్రజలసొమ్ము దోపిడీ చేసే పార్టీలన్నీ శనీశ్వర పార్టీలే
ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం ఖాయమని, ప్రజలకు అవసరమైంది ఏ పార్టీ చేయదని చర్చిస్తున్నారు. ప్రజలసొమ్ము దోపిడీ చేయాలని ప్రయత్నం చేసే ఏ పార్టీ నాయకులైనా, ఏ ప్రభుత్వాలు అయినా శనీశ్వరులే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టింపు లేని పార్టీలు కూడా శనీశ్వర పార్టీలే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+