కేంద్రంపై కేసీఆర్ బీఆర్ఎస్ లేఖల యుద్ధం!!

తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తన ప్రచ్చన్న యుద్ధాన్ని కొనసాగిస్తుంది. అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి లేఖల యుద్ధానికి తెరతీసింది. పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మొదలుపెట్టి కేంద్రానికి ప్రతిక్షణం కంటిమీద కునుకు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, గిరిజనుల రిజర్వేషన్ల అంశం ఇలా వివిధ అంశాలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజలను కూడా భాగస్వాములను చేసి ఉత్తరాల ఉద్యమాన్ని మొదలుపెట్టింది.

BRS Party Logo

ఉపాధి హామీ పథకం పై పోస్ట్ కార్డులు ఉద్యమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం ప్రారంభించగా, తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన రిజర్వేషన్లపై పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు పోస్ట్ కార్డుల ద్వారా లేఖలు రాసి, తమ సందేశాన్ని పంపి, నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదటి లేఖను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోస్ట్ బాక్స్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖను పోస్ట్ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో రైతులు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రమంత్రికి లేఖలు రాశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేంద్రం తెలంగాణ రైతాంగం పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ గిరిజనులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం పోస్టర్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. తెలంగాణ గిరిజనులకు సంబంధించిన కీలక అంశమైన పది శాతం గిరిజన రిజర్వేషన్లను, అలాగే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు రాసి పంపించే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కెసిఆర్ ఈ రాష్ట్రంలోని గిరిజనులు నష్టపోకుండా పది శాతం రిజర్వేషన్లను అమలు చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపితే, కేంద్రం మాత్రం గిరిజనులకు అడుగడుగునా నష్టం చేస్తుందన్నారు.

విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పాఠశాలలు మొదలుకొని యూనివర్సిటీ వరకు ప్రతి గిరిజన విద్యార్థి చేత పోస్టు కార్డు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇలా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన హామీలపై అనేక అంశాలను లక్ష్యంగా చేసుకొని కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కొనసాగిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+