తెలంగాణలో ‘బ్రూసెల్లా ఇథిపికల్' వైరస్ కలకలం.. కుక్కలతో జాగ్రత్త

తెలంగాణలో వీధికుక్కల బెడద పెరిగిపోతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్దులపై వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కువ శాతం ఈ దాడులు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒకవైపు ఈ దాడుల ఘటనలతో ప్రజలు సతమతం అవుతుంటే.. మరోవైపు తెలంగాణలో మరో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ వైరస్ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది.

తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఒక చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసి పలువురు బీకేర్‌ఫుల్ అని చెబుతున్నారు. బాలికను రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం కనగర్తికి చెందిన 4 ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీమేథగా గుర్తించారు. చిన్నారి ఇటీవల తీవ్ర జ్వరం, శరీరంపై అలర్జీతో బాధపడుతుండడంతో.. సిరిసిల్లలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా దానికి సంబంధించి వ్యాధి నిర్ధారణ కాలేదు.

Brucella atypical virus tinction in Telangana Be careful with dogs

దీంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యుల చేసిన పరీక్షల్లో విషయం బయటపడింది. దాన్ని 'బ్రూసెల్లా ఇథిపికల్' అనే వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ అనేది సామాన్యంగా కుక్కలకు మాత్రమే వస్తుందని వైద్యులు తేల్చారు. దీంతో ఆ వైరస్ సోకిన కుక్కల మధ్య ఆడుకోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

అలానే కుక్కలకు ఈ వైరస్ ఎలా సోకుతుందో అని డాక్టర్లు స్పష్టం చేశారు. కలుషితమైన నీటిని తాగడం, కలుషితమైన చికెన్ వ్యర్థాలు తినడం, పచ్చి మాంసం వ్యర్థాలు తినడం ద్వారా కుక్కలకు ఈ వైరస్ సోకుతుందని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+