పదేళ్ళు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్న కేటీఆర్

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సారి బడ్జెట్ పైన అన్ని రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణా విభజన నాటి హామీలు అమలు చేస్తారని కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాయి. అయితే తెలంగాణా రాష్ట్రానికి బడ్జెట్ లో ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణాపై మోడీ ప్రేమ ఇలా
ఈ బడ్జెట్ పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది. కానీ మోడీ సర్కార్ గత పదేళ్లుగా తెలంగాణ పై సవతి తల్లి ప్రేమనే చూపుతోందని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఈసారి కూడా ఆశలు అడియాశాలే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Budget 2024 KTR said about Telangana allocations in Modi govt budget

మోడీ ఎప్పుడూ పట్టించుకోలేదు
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేంద్రం నుంచి సాయం అందాల్సినప్పటికీ మోడీ ఎప్పుడూ పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. ప్రతి బడ్జెట్ లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఐతే ఈ సారి బీజేపీకి తెలంగాణలో 8ఎంపీ సీట్లు వచ్చాయి. కనుక ఇక్కడి ప్రజలు మోడీ మీద, తెలంగాణా నుండి ఉన్న ఇద్దరు మంత్రుల మీద అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకున్నారన్నారు.

మోడీతో వాటి గురించి మాట్లాడే సత్తా మన ఎంపీలకు లేదు
కేంద్రంలో గెలిచే ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించారు. అందుకే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం మన బీజేపీ ఎంపీలు మోడీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి. నాకు తెలిసి మోడీతో మన ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడే సత్తా మన బీజేపీ ఎంపీలకు లేదు. కనుక ఎప్పటిలాగే తెలంగాణకు ఈ బడ్జెట్ లోను గుండుసున్నానే అని కేటీఆర్ అన్నారు.

పదేళ్ళు ఏం చేశారు కేటీఆర్
ఈ సారి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఎలా ఉంటాయని నన్ను ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడని పేర్కొన్న కేటీఆర్ దానికి నా సమాధానం ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్ లో అదే పరిస్థితి ఉంటుందని మళ్లీ కేటాయింపులు గుండాసున్నానే అని గట్టి నమ్మకం ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో యుద్ధం చేసి రాష్ట్ర ప్రయోజనాలను సాధించకుండా, ఇప్పుడు బడ్జెట్ పై ఆసక్తి లేదని చెప్పటంపై పదేళ్ళు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నారా అంటూ కేటీఆర్ పై రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+