బంపర్ ఆఫర్: వారికి బిగ్ రిలీఫ్.. పోలీసుల శుభవార్త!
నూతన సంవత్సరం వేళ వరంగల్ కమీషనరేట్ పోలీసులు శుభవార్త చెప్పారు. ఎలాంటి చట్టవ్యతిరేఖ చర్యలకు పాల్పడకుండా సత్‌ప్రవర్తనతో జీవితం కొనసాగిస్తే రౌడీ షీట్ నుండి పేర్లు తొలగించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. నేడు 19 మందికి పరివర్తన కార్యక్రమంలో భాగంగా వారికి గుడ్ న్యూస్ చెప్పారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 19మందిపై రౌడీషీట్ల తొలగింపు
నూతన సంవత్సరం వేళ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమములో ''పరివర్తన'' కార్యక్రమము ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లతో పాటు కేడీలు, అనుమానుతులపై వున్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రౌడీ షీటర్లతో పాటు కేడీలు, అనుమానుతులకు అందజేశారు.

రౌడీ షీటర్లతో పాటు, కేడీలు, అనుమానితుల పేర్లు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లతో పాటు, కేడీలు, అనుమానితుల సుదీర్ఘ కాలంగా జాబితాలో వున్న పేర్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా వృద్ధాప్యంతో పాటు, సత్‌ప్రవర్తనతో జీవితాలను గడుపుతున్నట్లుగా ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుర్తించబడిన 19 మంది పేర్లు రౌడీ షీట్ నుండి తొలగించారు.
రౌడీషీట్ల పేర్లను తొలగిస్తూ వరంగల్ పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు
19 మందిలో 5గురు రౌడీ షీటర్లు, 12మంది అనుమానితులు,కెడీ ఒకరు,డిసి ఒకరిని సంబంధిత రౌడీ షీట్ల పేర్లను తొలగిస్తూ వరంగల్ పోలీస్ కమీషనర్ ఉత్తర్వులు అందజేసి ప్రస్తుతం ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారని పోలీస్ కమిషనర్ రౌడీ షీటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటంతో కారణంగానే మీపై పోలీస్ స్టేషన్లలో షీట్లను తెరవడం జరిగిందని అన్నారు.
సత్ప్రవర్తన ఉంటే రౌడీ షీట్ ల తొలగింపు
ప్రస్తుతం మీ వ్రర్తన బాగుందని విచారించిన అనంతరం మీపై షీట్లను తొలగించడం జరిగిందని, ఇదే రీతిలో భవిష్యత్తులో ఎలాంటి సంఘవ్యతిరేక,చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా మీ వృత్తులను కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతారని మీపై నమ్మకం వుందని. అలాగే భవిష్యత్తులో ఇదే రీతిలో రౌడీ షీట్లను తొలగించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో వెస్ట్‌జోన్ డిసిపి రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications