ఇంట్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు: గాయాలు
రంగారెడ్డి: జిల్లాలోని హైదర్‌గూడ ఏజి కాలనీలో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 20మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. డ్రైవర్ రాకపోవడంతో స్కూల్ పిఈటి బస్సును నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. బస్సు దూసుకెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ మృతి
వరంగల్ జిల్లాలోని నాయుడు పెట్రోల్ పంప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
ఈ ఘటనలో కారులో ఉన్న అభినవ్, సందీప్ అనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పిచ్చి కుక్కల దాడి: 10మందికి గాయాలు
కరీంనగర్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి 10 మంది వ్యక్తులను తీవ్రంగా గాయపర్చాయి. గాయపడ్డ బాధితులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications