రేవంత్ కేబినెట్ లో అయిదుగురు ఔట్, శాఖల మార్పు..కొత్తగా - ముహూర్తం ఫిక్స్..!?
తెలంగాణ మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మంత్రుల తీరు పైన పార్టీ అధినాయకత్వం పూర్తి సమాచారం సేకరించింది. తాజా విస్తరణలో అజారుద్దీన్ కు మాత్రమే అవకాశం దక్కింది. ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత మంత్రుల్లో దాదాపు అయిదుగురిని తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక.. శాఖల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని.. ముహూర్తం సైతం దాదాపు ఖరారు అయిందని పార్టీ నేతల సమాచారం.
తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. పని తీరు.. వివాదాల కు కారణంగా నిలుస్తున్న మంత్రులను తప్పించి.. సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ ఈ సారి మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్లు ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టారు. కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ తరువాత విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీకి
రేవంత్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ సమయంలోనే భారీ ప్రక్షాళన చేపట్టనుంది. మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కసరత్తులో కొత్తగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కేబినెట్ లో మరో ఇద్దరికి అవకాశం ఉంది. పునర్ వ్యవస్థీకరణతో మరి కొందరికి అవ కాశం దక్కనుందని చెబుతున్నారు. సీఎంతోపాటు తొలుత ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల పనితీరుపై అధిష్ఠానం ఇప్పటికే సమీక్ష చేసింది. ఆయా శాఖలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా, రాజకీయ నాయకులుగా వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకున్న అధి ష్ఠానం.. ఒక్కో మంత్రికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. వారి ప్రోగ్రెస్ రిపోర్టును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు మంత్రుల పనితీరుపై హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పనితీరు మెరుగు పరుచు కోని మంత్రుల స్థానంలో అదే వర్గాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వనున్నారు.
అదే విధంగా కీలక శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత.. ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు సీట్లు సహా మరో నలుగు లేదా అయిదుగురికి కొత్తగా అవకాశం దొరకనుందని పార్టీ నేతల సమాచారం. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్, ఇతర పదవులనూ భర్తీ చేయనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్ వంటి నేతలు మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. కాగా, వీరిలో ఇద్దరికి తాజాగా పదవులు ఇచ్చారు. దీంతో, వారిద్దరూ రేసు నుంచి తప్పుకొన్నట్లు స్పష్టమైంది. సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా సిఫార్సు చేసిన వారికే మంత్రి పదవులు నిరాకరించడం ద్వారా మిగిలిన వారికీ అధిష్ఠానం స్పష్టమైన సంకేతం ఇచ్చిందని ప్రచారం సాగుతోంది. దీంతో.. మంత్రివర్గ విస్తరణలోనూ హైకమాండ్ నిర్ణయం మేరకే తుది ఎంపిక జరగనుంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications