మున్సిపల్ ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు, బీఆర్‌ఎస్ అలెర్ట్..!!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఫలితాల పైన ప్రధాన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా తమ అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతలు 80 శాతానికి పైగా స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తమకు అనుకూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారు. బీజేపీ కొన్ని కార్పోరేషన్ల పైన నమ్మకం పెట్టుకుంది. అయినా... ఫలితాల ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ పరిణామాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితాల అనంతరం తన అభ్యర్థులు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా చూసేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలను ప్రారంభించాయి. ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు అభ్యర్థులతో ఆయా పార్టీల కీలక నేతలు సమావేశాలను నిర్వహిస్తున్నారు. వారికి పలు కీలక సూచనలు చేస్తున్నారు. పార్టీల ముఖ్య నేతలు క్యాంపు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. ఆదిలాబాద్, నిర్మల్‌ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బరిలో ఉన్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నా లు ముమ్మరం చేశారు. సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. రేపు ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌లు, రిసార్టులకు తరలిస్తోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

camp-politics-begin-in-many-parts-of-the-state-ahead-municipal-election-results-brs-alerts-the-cadr

ఫలితాల అంచనాలు.. క్యాంపుల్లోకి అభ్యర్దులు

పురపాలక ఎన్నికల్లో బాగా పనిచేశారని నేతలు, శ్రేణులను ఆయన అభినందించారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్ కొన్నిమున్సిపాల్టీలను సొంతంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులతో క్యాంపులను నిర్వహించి నేతలకు కేటీఆర్​ పలు కీలక సూచనలు చేశారు. విప్​ జారీ సహా అన్ని అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక.. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లను వినియోగించుకున్నారు. దీంతో, ప్రధాన పార్టీలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. తాము కూడా ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామని బీజేపీ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా.. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అన్ని రాజకీయపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. దీంతో, మున్సిపల్ ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+