తెలంగాణలో మరో ఉప ఎన్నిక - ఏం జరుగుతోంది..!?

సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇప్పుడు మరో ఉప ఎన్నిక రానుందా. ఎం జరిగే అవకాశం ఉంది.

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మరణించారు. ఆరోగ్యం క్షీణించడంతోపాటు కార్డియాక్‌ అరెస్టుతో ఉదయం తుది శ్వాస విడిచారు. కార్పోరేటర్ గా ఎన్నికల్లో పోటీ ప్రారంభించి..అయిదు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. సాయన్నకు భార్య గీత, ముగ్గురు కుమార్తెలు నమ్రత, లాస్య నందిత, నివేదిత ఉన్నారు. వీరిలో లాస్య నందిత గతంలో జీహెచ్‌ఎంసీ కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న సమయంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా. ఎన్నికల సంఘం నిబంధనలు ఏం చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఏం జరగనుంది.

ఎమ్మెల్యే సాయన్న మృతితో..

ఎమ్మెల్యే సాయన్న మృతితో..

సాయన్న మూడున్నార దశాబ్దాలు రాజకీయాల్లో కొనసాగారు. 1986లో తొలిసారిగా బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసిన సాయన్న పరాజయం పాలయ్యారు. అనంతరం 1994లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1999, 2004లో కూడా కంటోన్మెంట్‌ నుంచి సైకిల్‌ గుర్తుపై పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాలతో రికార్డు సృష్టించారు. 1999లో ఓడిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో వారసులను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతలో ఆయన అస్వస్థతకు గురి కావటం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు.

కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక ఉంటుందా..

కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక ఉంటుందా..

ఎమ్మెల్యే సాయన్న మృతితో ఉప ఎన్నిక వస్తుందా అనే అంశం పైన చర్చ మొదలైంది. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిబంధలన మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా లేదా మరణం కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయితే ఆరు నెలల్లోగా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఎన్నిక నిర్వహించినా.. ఆ తరువాత కొత్త సభ్యులు రెండు లేదా మూడు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉంటే కేంద్రంతో చర్చించిన తర్వాత ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగే అవకశాలు లేవని చెబుతున్నారు. ఒక వేళ ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నిర్ణయిస్తే మే లో జరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా నిర్వహించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

సీఎం కేసీఆర్ నివాళి - నేడు అంత్యక్రియలు

ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. సాయన్న అరుదైన ఘనత సాధించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కేసీఆర్‌ కొనియాడారు. సాయన్న మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పలు పార్టీల నేతలు సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపారు. సోమవారం ఉదయం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీ్‌సలో సాయన్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు. అనంతరం భన్సీలాల్‌పేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియులు నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+