కాచిగూడ రైల్వే ట్రాక్ పై కారు కలకలం.. పోలీసులు హై అలర్ట్..
నిత్యం రద్దీగా ఉండే కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఊహించని ఘటన జరిగింది. దీంతో హైదరాబాద్ నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి కాచిగూడ రైల్వే ట్రాక్ పై కారును వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డుగా అడ్డంగా కారు పెట్టి వెళ్లిపోవడంతో అటు వాహనదారులు, షాపు యజమానులు, అటుగా వెళ్తున్న ప్రజలు భయాందోళన చెందారు. దిల్లీ కారు బాంబు పేలుడు ఘటనను గుర్తుతెచ్చుకుని ఆందోళన చెందారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేశారు.
కాచిగూడ రైల్వే ట్రాక్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే ట్రాక్ కు అడ్డంగా ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేసి వెళ్లిపోయాడు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కాచిగూడ రైల్వే ట్రాక్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2025
కాచిగూడ రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని కారు కలకలం
రైల్వే ట్రాక్‌పై కారును వదిలి వెళ్లిన దుండగులు
ఢిల్లీ ఘటన నేపధ్యంలో పోలీసులు హై అలెర్ట్
బాలాజీ అనే పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు గుర్తించి పోలీసులు విచారించగా, కారు రెంట్‌కి ఇచ్చినట్టు తెలిపిన యజమాని… pic.twitter.com/tImJAVEpKJ
ఈ కారు బాలాజీ అనే పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించి పోలీసులు విచారించగా.. కారు రెంట్ కు ఇచ్చినట్టు యజమాని తెలిపాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో కారును అక్కడ వదిలేసి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పై ఉంచిన కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా చెకింగ్ చేశారు. ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని తనిఖీలు చేశారు. ఆ తర్వాత పోలీసులు కారు యజమానిని పిలిపించారు. ఆ వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.

మరోవైపు దిల్లీ బాంబు పేలుడు దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ నగరాలలో తనిఖీలు చేస్తోంది. ఈ మేరకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. ఇక హైదరాబాద్ లోని అన్ని మెట్రో స్టేషన్లలో ఇప్పటికే పోలీసులు తనిఖీలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications