• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్ ఓవర్ లోడ్; టీఆర్ఎస్ ట్రబుల్ ఇంజన్? కేసీఆర్ ప్రయోగమే ఆయన కొంప ముంచనుందా?

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు రోజురోజుకు పెరిగి పోతున్నారు అన్న చర్చ ప్రధానంగా కొనసాగుతోంది. ఎప్పుడైనా ఎవరైనా పార్టీ నుండి జంప్ అవ్వొచ్చు అన్న చర్చ పార్టీ నేతల్లోనే ప్రధానంగా కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీని కాదని, ప్రతిపక్ష పార్టీల వైపు అసలు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు చూస్తున్నారు? పార్టీలో ఏం జరుగుతుంది? నేతల అసంతృప్తికి అసలు కారణం ఏమిటి? అన్న విషయాలను చూస్తే

ఇతర పార్టీల నేతల చేరికలకు రెడ్ కార్పెట్ వేసిన గులాబీ బాస్

ఇతర పార్టీల నేతల చేరికలకు రెడ్ కార్పెట్ వేసిన గులాబీ బాస్

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ కోసం కీలకంగా పనిచేసిన నాయకులు చాలామంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని వదిలి ప్రత్యర్థి పార్టీల లో చేరగా, మరికొంత మంది నేతలు పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. గత రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడుతున్న టిఆర్ఎస్ పార్టీ, పార్టీ కోసం మొదటినుంచి పనిచేసిన నేతలకు అవకాశం ఇవ్వడం లేదు అనేది పార్టీ నేతల్లో ఉన్న ముఖ్యమైన అసంతృప్తి.

రెండు దఫాలుగా అధికారం చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. టికెట్ వార్

పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. టికెట్ వార్

ఇక పాత,కొత్త నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడం, వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగటం అనేక జిల్లాలలో ప్రధానంగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు సైతం చేసుకున్నారు. నియోజకవర్గాలలో ఎవరికివారు తమ ప్రాభవం తగ్గిపోకుండా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు టిఆర్ఎస్ పార్టీలో లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంది. ఈ క్రమంలో టికెట్ ఆశించే వారు, తమకు టిక్కెట్ రాదని క్లారిటీ వస్తే పక్క పార్టీల్లోకి జంప్ అవ్వడం పక్కా అని ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. కారు ఓవర్ లోడ్ అవ్వటమే టీఆర్ఎస్ ట్రబుల్ ఇంజన్ కు కారణమని చర్చిస్తున్నారు.

ఓవర్ లోడ్ అయిన కారు.. దిగేందుకు సిద్ధం అవుతున్న నేతలు

ఓవర్ లోడ్ అయిన కారు.. దిగేందుకు సిద్ధం అవుతున్న నేతలు


ఓవర్ లోడ్ అయిన కారులో తాము ప్రయాణం చెయ్యలేము అన్న భావన చాలామంది నాయకులలో వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటే తమ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది అన్న భావన కూడా చాలామంది నాయకులలో ప్రధానంగా కనిపిస్తున్నట్లు గా తెలుస్తుంది. అయితే ఇప్పుడే పార్టీ మారితే అధికార పార్టీ కావడంతో టీఆర్ఎస్ నుండి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న భావనతో, వచ్చే ఎన్నికల ముందు ఊహించని విధంగా టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి ప్రత్యర్థి పార్టీలలో చేరడానికి చాలామంది నేతలు రెడీ అవుతున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష .. ఇప్పటి పరేషాన్ కు కారణం

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష .. ఇప్పటి పరేషాన్ కు కారణం

పార్టీని బలోపేతం చేయాలని గతంలో ఇబ్బడిముబ్బడిగా ఆపరేషన్ ఆకర్ష అంటూ ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని రావడం ఇప్పుడు పార్టీ బలహీన పడడానికి, గులాబీ పార్టీ పరేషాన్ కు ప్రధాన కారణం గా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాలలో పాత కొత్త నాయకుల మధ్య పోరులో, టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా పని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికల్లో వారికి ఛాన్స్ ఇవ్వాలని, లేదంటే చుక్కలు చూపించటం పక్కా అన్నసంకేతాలను ఇప్పటి నుంచే పలువురు నేతలు అధిష్టానానికి పంపుతున్నారు.

జంపింగ్ జపాంగ్ లను ఆపడం సీఎం కేసీఆర్ కు కష్టమే

జంపింగ్ జపాంగ్ లను ఆపడం సీఎం కేసీఆర్ కు కష్టమే

చాలాచోట్ల సీనియర్ నేతలపై గెలుపొందిన ప్రత్యర్థి పార్టీల నాయకులను చేర్చుకోవడం తో, సీనియర్ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారు. చాలాచోట్ల సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే వారంతా గోడ దూకటానికి రెడీ అవుతున్నారు. దీంతో గత రెండు దఫాల ఎన్నికల మాదిరిగా వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయం సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు అన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా తాజా పరిణామాలతో జంపింగ్ జపాంగ్ లను ఆపడం సీఎం కేసీఆర్ కు కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది.

English summary
The main reason for the dissatisfaction of leaders in TRS is the dominance between old and new leaders for tickets. It is discussed that KCR's operation Akarsha will damage his party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X