హారతి పళ్ళెంలో డబ్బులు పెట్టి అడ్డంగా బుక్కైన మంత్రి!!
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండలం కొంగరి గిద్ద గ్రామంలో బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార సభ అనంతరం అక్కడి మహిళలకు డబ్బులు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంత్రి సత్యవతి రాథోడ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ మరియు గిరిజన స్రీ ,శీశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ పెద్దగూడూరు మండలం కొంగరి గిద్ద గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు.

ప్రచారం నిర్వహించటానికి వచ్చిన సత్యవతి రాథోడ్ కు అక్కడి మహిళలు హారతి పట్టారు. హారతి పట్టిన మహిళలతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్, తనకు హారతి పట్టినందుకు గాను సంతోషం వ్యక్తం చేస్తూ వారి పళ్లెంలో నాలుగు వేల రూపాయలను వేశారు. ఇక ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది.
సత్యవతి రాథోడ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని చేసిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన 171E, 171- H,R/W 188 i0c కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.
హారతి పళ్ళెంలో డబ్బులు పెట్టి అడ్డంగా బుక్కైన మంత్రి..!!#SatyvathiRathod #BRS #BRSParty #Congress #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElection2023 #Oneindiatelugu pic.twitter.com/BPpD6o78na
— oneindiatelugu (@oneindiatelugu) November 17, 2023
దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి స్వయంగా డబ్బులు ఇస్తున్న వీడియోలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications