aghori news: అర్దరాత్రి స్మశానంలో చేసిన పనికి లేడీ అఘోరీపై కేసు నమోదు!
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి వ్యవహారం ఇప్పుడు తాజాగా పోలీస్ కేసు నమోదు కావటంతో మరో మారు చర్చనీయాంశం అయ్యింది. గత కొంత కాలంగా స్థానికులతో పాటు పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్న లేడీ అఘోరీ నాగ సాధు వ్యవహారంలో తాజాగా కేసు నమోదు అయ్యింది.
అర్దరాత్రి స్మశానంలో అఘోరీ పూజలు
ఇక ఇటీవల వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో వరంగల్ కు చేరుకున్న అఘోరి వరంగల్లోని బెస్తం చెరువు స్మశాన వాటికలో రాత్రివేళ పూజలు చేసిన విషయం తెలిసిందే. అఘోరి శరీరానికి చితిలోని బూడిదను పూసుకొని ఆరిపోయిన చితి పైన త్రిశూలాలను ఏర్పాటు చేసి కోడిని కోసి రక్త తర్పణం ఇచ్చి పూజలు చేసింది.

అర్దరాత్రి స్మశానంలో అఘోరీతో హిజ్రాలు
దీంతో అఘోరి స్మశానంలో పూజలు చేస్తుందని చూసిన స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న హిజ్రాలు కూడా అప్పుడు అర్ధరాత్రి అఘోరీని కలవడానికి స్మశానానికి వెళ్లారు. అఘోరి నాగసాధు కూడా ఒక హిజ్రా కావడంతో హిజ్రాలు తన మానసిక స్థితిని తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్లారు. పబ్లిక్ ప్రదేశాలలో తిరగడం తప్పని చెప్పే ప్రయత్నం చేశారు.
హారర్ సినిమాలా కోడిని చంపి పూజలు
పబ్లిక్ ప్రదేశాలలో ఎందుకు తిరుగుతున్నావని అర్ధరాత్రి స్మశానానికి వెళ్లిన హిజ్రాలు అఘోరి నాగసాధును ప్రశ్నించారు . కానీ వారికి ఏమీ సమాధానం చెప్పని అఘోరీ హారర్ సినిమాని తలపించే విధంగా ఆరిపోయిన చితిపైన త్రిశూలాలు ఏర్పాటు చేసి ఆ త్రిశూలాల మధ్యలో కూర్చొని తన వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రి తో, కోడితో పూజలు చేశారు.
అఘోరీపై ఫిర్యాదు చేసిన కరీంనగర్ వ్యక్తి
అక్కడ కోడిని బలిచ్చి చేసిన పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కరీంనగర్ కు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో లేడీ అఘోరీపైన మామునూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అఘోరీపై ఫిర్యాదు చేసిన రోహన్ రెడ్డి కోడిని బలిచ్చి హింసించిన వీడియోతో ఫిర్యాదు చేశారు.
మామునూరు పోలీస్ స్టేషన్ లో అఘోరీపై కేసు
తెలంగాణా జంతువుల మరియు పక్షుల బలి నిరోధక చట్టం 1950, బీఎన్ఎస్ యాక్ట్ 2023, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యాక్ట్ 1960 క్రింద కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మామునూరు పోలీస్ స్టేషన్లో కోడిని చంపిన కేసు నమోదైంది. లేడీ అఘోరీపై 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications