కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదైంది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేశారంటూ..ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేటీఆర్‌తో పాటు పార్టీ నాయకులు గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించడానికి కేటీఆర్ ఎటువంటి ముందుస్తు అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు.

అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించడమే కాకుండా డ్రోన్ ఎగరేసి అక్కడున్న దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించారని ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డిల మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పీఎస్‌లో బీఎన్ఎస్ 223(b) సెక్షన్ కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.












Click it and Unblock the Notifications