చర్లపల్లి జైలు నుంచి విడుదల: ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఆయన తాత్కాలిక బెయిల్‌పై హైదరాబాదులోని చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.
కూతురు నిశ్చితార్థం ఉండడంతో రేవంత్ రెడ్డికి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో గల తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు.

జైలు నుంచి విడుదలైన ఆయనను సోదరుడు కొండల్ రెడ్డి తదితరులు వచ్చి నివాసానికి తీసుకుని వెళ్లారు. చర్లపల్లి జైలు వద్దకు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.
బెయిల్‌పై బయట ఉన్న సమయంలో మీడియాను గానీ, రాజకీయ నాయకులను గానీ కలవకూడదని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు రేవంత్ రెడ్డికి షరతు విధించింది. కేవలం 12 గంటల పాటు ఎసిబి కోర్టు ఆయన బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications