వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో అగ్రకుల ఆధిపత్యం ఉంది.. లేకుంటే 1990 లోనే సీఎం అయ్యేవాడ్ని ..వీహెచ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన వీహెచ్ సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వీహెచ్ కాంగ్రెస్ పార్టీ లో అగ్రకుల ఆధిపత్యం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు .

అస్తవ్యస్థమవుతున్న వ్యవస్థలు అనే అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వీహెచ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు .1990లోనే తనకు సీఎంగా అవకాశం వచ్చిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు స్పష్టం చేశారు. అయితే తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో కొందరు తనను సీఎం కానివ్వకుండా అడ్డుకున్నారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్యం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన బీసీ నేత సీఎం అయిన రోజే రాష్ట్రం బాగుపడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు .

Caste domination in the Congress .. otherwise i will be the CM in 1990 . V.H sensation

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్ష ఫలితాల అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ ను బర్తరఫ్ చేయాలని అలాగే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డితో రాజీనామా చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వీ హనుమంతరావు .

English summary
Congress Party senior leader V.Hanumatha rao made sensational comments on own party, The former MP and Congress senior leader V. Hanmanta Rao made it clear that he had a chance to become CM in the 1990s. But he said that he was a person of the Bc community and some had prevented him from getting the chance as CM.There is a caste dominance in the congress party he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X