తెలంగాణలో హోటళ్ళు, రెస్టారెంట్ల కిచెన్‌లో సీసీ కెమెరాలు.. కల్తీకి చెక్ పెట్టేలా సూపర్ ప్లాన్!

తెలంగాణలో రెస్టారెంట్లు, హోటళ్లకు షాకింగ్ న్యూస్.. బయట ఆహారం తినేవారికి మాత్రం సూపర్ న్యూస్. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని రెస్టారెంట్లు, హోటళ్ల కిచెన్‌లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని టీజీ సేఫ్ అధికారులు ఆదేశించారు. కస్టమర్లు తమ కళ్లముందే వంట ఎలా తయారవుతుందో చూసే అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

ఇటీవల పలు రెస్టారెంట్లలో అపరిశుభ్రత, ముడి పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, కుళ్ళిపోయిన, పాడైపోయిన పదార్ధాల వంటకాలు, డేట్ ఎక్పైర్ అయిన సామాను వాడటం, వంటగదుల్లో చెత్త చెదారం, అపరిశుభ్ర వాతావరణం వంటి సమస్యలపై ఫిర్యాదులు పెరిగాయి. దీనితో ఆహార భద్రతపై ప్రజల్లో ఆందోళనలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టీజీ సేఫ్ అధికారులు హైదరాబాద్‌లో రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై కీలక సూచనలు చేశారు.

CCTV in Restaurant Kitchens for Better Food Safety Telangana Mandates TG Safe Orders

వంటగదుల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆహార తయారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించవచ్చని, దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని వారు స్పష్టం చేశారు. అధికారులు మరికొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ప్రతి రెస్టారెంట్ తప్పనిసరిగా హైజీన్ రేటింగ్‌తో కూడిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధ్రువపత్రం పొందాలని సూచించారు.

ఆహారంలో హానికరమైన రంగులు వాడకూడదని, నిషేధిత పచ్చి గుడ్డు మయోనైజ్‌ను ఉపయోగించకూడదని హెచ్చరించారు. వంటగదులను రోజూ శుభ్రం చేయడం, పదార్థాలను సరైన ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు ఈ సూచనలకు సానుకూలంగా స్పందించారు.

వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఒక నెల రోజుల్లోపు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే కస్టమర్ లలో కూడా నమ్మకం పెరుగుతుందని, రెస్టారెంట్ల నిర్వహణలో బాధ్యత కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పెద్ద హోటళ్లు ఓపెన్ కిచెన్ వ్యవస్థను అనుసరిస్తున్నాయి. కానీ చాలా చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లలో ఇంకా పాత పద్ధతులే కొనసాగుతున్నాయి.

డిసెంబర్ లో ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0.. టార్గెట్ ఇదే!

కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కేవలం పరిశుభ్రతే కాకుండా, సిబ్బంది ప్రవర్తన, పదార్థాల నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తే, తెలంగాణలోని రెస్టారెంట్లు మరింత నమ్మకమైన, సురక్షితమైన ఆహార కేంద్రాలుగా మారనున్నాయి. అప్పుడు ఆహార కల్తీకి చెక్ పెట్టునట్టు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+