డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0.. టార్గెట్ ఇదే
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణా రైజింగ్ అంటూ పురోగతిలో దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్త పెట్టుబడులను తెలంగాణాకు ఆహ్వానిస్తోంది. గతేడాది ఇన్వెస్ట్ తెలంగాణా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన విధంగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0'ను నిర్వహించనుంది.
గతేడాది జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కొనసాగింపుగా ఈసారి పూర్తిగా పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్షంగా తెలంగాణా ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది.

ఈ లక్ష్యాలను సాధించేందుకు పెద్ద ఎత్తున విదేశీ, దేశీయ పెట్టుబడులు అవసరం. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ 2.0, GCCs, డేటా సెంటర్స్, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్ వంటి సెక్టార్-స్పెసిఫిక్ పాలసీలను విడుదల చేసి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెప్తోంది. ఈ సమ్మిట్ తో "మీ పెట్టుబడికి మా భరోసా" అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
2025 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. మొదటి రోజు సుమారు రూ.1.88 నుంచి 2.43 లక్షల కోట్లు, రెండో రోజు మరో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది తెలంగాణా సర్కార్. రెన్యూవబుల్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఫార్మా, డీప్ టెక్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణా ప్రభుత్వం.
ఈ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ఏ రాష్ట్రం ఒకే సమ్మిట్‌లో సాధించిన అత్యధిక పెట్టుబడి హామీల్లో ఒకటి. ఈసారి సమ్మిట్‌ను పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్-ఫోకస్డ్ గా నిర్వహిస్తున్నారు. కొత్త పాలసీలు విడుదల చేసి, గతేడాది సంతకం చేసిన ఎంఓయూల అమలుపై దృష్టి సారించనున్నారు. ప్రత్యేకంగా జీసీసీలు, డేటా సెంటర్స్ & AI, ఏరోస్పేస్ & డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం. USD 25 మిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జపాన్, మిడిల్ ఈస్ట్, స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి భారీ పెట్టుబడులు రావాలని అంచనాగా పెట్టుకుంది .













Click it and Unblock the Notifications
