పసివాళ్లకు ఆయాల వాతలు: ఇంత కర్కశమా.. కలెక్టర్ సీరియస్ (పిక్చర్స్)

కరీంనగర్: ఆయాలు చిన్నారుల పైన దయ్యాల్లా ప్రవర్తించిన సంఘటన కరీంనగర్లోని శిశువిహార్లో వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వారి బాగోతం బయటపడింది. పసివాళ్ల చేతుల పైన ఆయాలు వాతాలు పెట్టిన వైనం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. దీనిపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. సిబ్బందిని వెంటనే తొలగించారు.

అనాథలు, కన్నపేగులను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోతే ఆ చిన్నారులకు శిశువిహార్ దిక్కు అయింది. ఆ చిన్నారులను ప్రేమగా చూసుకోవాల్సిన ఆయాలు మాత్రం శాడిస్ట్‌ల్లా వ్యవహరించారు. చెంచాను స్టవ్ పైన వేడి చేసి పిల్లల చేతుల పైన వాతలు పెట్టారు.

కరీంనగర్ శిశువిహార్లో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు మూడు నెలల పసిబాబు మోక్ష. మిగిలిన ఏడుగురు రెండేళ్ల నుంచి ఐదేళ్ల లోపు వారు. ఇందులో ఐదేళ్ల గీత, ధనలక్ష్మిలతో పాటు రెండేళ్ల రాజన్ చేతులపై గాయాలు అయ్యాయి. మిగిలిన వారికి చిన్న గాయాలయ్యాయి. గీత చేతిపై బొబ్బలు వచ్చి పుండుగా మారింది.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల చేతులపై ఆయాలు చెంచా కాల్చి వాతలు పెట్టిన ఉదంతంలో కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఉదయం హుటాహుటిన శిశు గృహను ఆమె సందర్శించారు. ఆశ్రయం పొందుతున్న పిల్లలందరి చేతుల మీద కాల్చిన వాతలు ఉన్నట్లు గుర్తించారు.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

వీరిలో గీత, స్వరూప, రాజన్‌ అనే ముగ్గురి పిల్లలకు గాయాల తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతరం కలెక్టర్‌ ఐసీడీఎస్‌ పీడీ మోహన్ రెడ్డిని పిలిచి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటన 15వ తేదీన జరిగితే మూడు రోజుల పాటు మీకెందుకు తెలియలేదని నిలదీశారు. శాడిస్ట్ ఆయాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

ఈ వ్యవహారాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ వరుస ప్రశ్నలు సంధించడంతో పీడీ నోరు మెదపలేదు. నువ్వు పని చేయడానికి పనికిరావని, జిల్లా వదిలి వెళ్లాలని, నీ విషయంపై వెంటనే ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని మీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని పీడీ పైన మండిపడ్డారు.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

ఆ తర్వాత కలెక్టర్ సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. చిన్నారులపై వాతలు పెట్టడానికి స్టౌ అంటించిన బుచ్చమ్మ, పిల్లలకు వాతలు పెట్టిన పద్మ అనే ఇద్దరు ఆయాలను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని రెండో పట్టణ సీఐ హరిప్రసాద్‌ను ఆదేశించారు.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన మరో ఆయా పద్మను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. విధులపై నిర్లక్ష్యం వహించినందుకు ఒప్పంద ఉద్యోగులు శిశుగృహ మేనేజర్‌ దేవరావు, సామాజిక కార్యకర్త శ్రీలతలపైనా వేటు వేశారు.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

శిశు గృహలో జరిగిన దారుణంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుత రావు తీవ్రంగా స్పందించారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించారు. విచారణ జరిపి మే 2లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు నోటీసు పంపించారు.

 చిన్నారులకు వాతలు

చిన్నారులకు వాతలు

మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు సైతం పిల్లలను పరామర్శించారు. అధికారుల అలసత్వం వల్లనే సిబ్బంది ఇలా ప్రవర్తించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+