Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా రైతులకు సంక్రాంతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కేంద్రం!

నిజామాబాద్ ప్రజల చిరకాల కోరిక తీర్చి తెలంగాణ రైతాంగానికి కేంద్రం శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పసుపు బోర్డును ప్రారంభించారు.

ఏర్పాటైన పసుపు బోర్డు
ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మపురి అరవింద్ చేసిన కృషిని కొనియాడారు.

Center gave a wonderful gift to farmers with turmeric board in nizamabad from Sankranti

ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పసుపు బోర్డు
ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు. 2023 అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4వ తేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

మాట నిలబెట్టుకున్న ధర్మపురి అరవింద్
తాజాగా నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఈరోజు కేంద్రమంత్రి ప్రకటించి పసుపు బోర్డ్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించారు. గతంలో ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఏర్పాటుపైన స్టాంపు పేపర్ మీద రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఎట్టకేలకు తాను అన్న మాటను నెగ్గించుకున్నారు.

రైతాంగానికి అసలైన పండుగ రోజు
నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం బిజెపికి నిజామాబాద్ లో మంచి బూస్ట్ వచ్చినట్లుగా పరిస్థితి మారింది. బీజేపీ ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్టు ఏర్పాటు చేయడంతో, సంక్రాంతి పండుగ రోజు పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో, ఈ సంక్రాంతి నిజంగా రైతాంగానికి అసలైన పండుగ రోజు అని నిజామాబాద్ వాసులు భావిస్తున్నారు నిజామాబాద్ లో ఏర్పడిన పసుపు బోర్డుతో రైతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కల నేడు నెరవేరినందుకు నిజామాబాద్ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+