సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా తీపికబురు చెప్పిన కేంద్రం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు తీపి కబురు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిని గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం సంసిద్ధంగా ఉందని వారు వెల్లడించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు గురించి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం మాట్లాడారు.
మేడారం జాతరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని పేర్కొన్న ఆయన, ఇది దేశంలోని అన్ని సమూహాలు కలిసి జరుపుకునే అద్భుతమైన జాతరగా చెప్పారు. ఇది మహా కుంభమేళా వంటిదని కొనియాడారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తాను మేడారం వచ్చానని గుర్తు చేసుకున్న ఓరం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు తిరిగి ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

గిరిజన సంక్షేమం కోసం కేంద్ర పథకాలు
ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం ధర్తీ ఆబా గిరిజన గ్రామ వికాస్ అభియాన్ క్రింద లక్ష కోట్ల రూపాయలు, పీఎం జన్ మన్ పథకం కింద 24 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 23 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ లను మంజూరు చేశామని గుర్తు చేశారు.
890 కోట్ల రూపాయలతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు
ఇదే సమయంలో సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 890 కోట్ల రూపాయలతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రితో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గిరిజన యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పనులను ఇప్పటికే ప్రారంభించామని, తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీకి కావలసినటువంటి భూమిని అందించిందని ఆయన తెలిపారు.
ట్రైబల్ యూనివర్సిటీ పనులు మొదలుపెట్టిన కేంద్రం
గిరిజన సంక్షేమానికి, వారి సాంస్కృతిక పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే ములుగు ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడానికి ట్రైబల్ యూనివర్సిటీని తీసుకువచ్చామని తెలిపారు. గిరిజన యువత, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్న కేంద్రం ట్రైబల్ యూనివర్సిటీ పనులను మొదలు పెట్టిందని వెల్లడించారు.
త్వరలోనే మోదీతో భూమిపూజ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ట్రైబల్ యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారని అన్నారు. కొత్త గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు ముందు జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన కేంద్రమంత్రులు సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపైన కీలక విషయాలను వెల్లడించడంతో పాటు శుభవార్త చెప్పారు.
-
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications