చలానాలు పెండింగ్ ఉన్నాయా, లాస్ట్ ఛాన్స్.. వాహనం సీజ్ - తాజా మార్గదర్శకాలు..!!

వాహనదారులకు బిగ్ అలర్ట్. ట్రాఫిక్ రూల్స్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సిందే. చలానాలు పెండింగ్ లో ఉంటే ఇక కుదరదు. నిర్దేశిత సమయంలో చెల్లించాలి. లేకపోతే వాహనం సీజ్ చేస్తారు. ఇందుకు సంబంధించి కేంద్రం తాజాగా మోటారు వెహికల్స్ చట్టం లో కీలక సవరణలు చేసింది. ఇందుకు సంబంధించి పెండింగ్ చలానాలు.. నిర్దేశిత కాల పరిమితి.. తదుపరి చర్యల పైన స్పష్టత ఇచ్చింది.

వాహనదారులు చలానాలు పెండింగ్ లో ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి. లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి ఆలస్యం చేస్తే మీ వాహనాన్ని అధికారులు సీజ్ చేస్తారు. డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌ అవ్వదు. తాజాగా సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989లో కేంద్ర రవాణా శాఖ పైన వివరించిన కీలక సవరణలను ప్రతిపాదించింది.

Central Government Implements Key Amendments to Motor Vehicles Act Important Alert for Vehicle Owners

కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చింది.చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్‌ చేయడం తదితర అంశాలను డిజిటల్‌ మానిటరింగ్, ఆటోమేషన్‌ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడు రోజుల్లోగా ఎలక్ట్రానిక్‌ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్‌ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.

కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే దిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. [email protected] కు ఈ-మెయిల్‌ కూడా చేయొచ్చని స్పష్టం చేసింది.

ప్రస్తుతం 90 రోజుల్లోగా (మూడు నెలలు) చలాన్‌ కట్టాలి. కాగా, చలాన్‌ చెల్లింపు గడువును 45 రోజులకు తగ్గించారు. చెల్లించడం ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు. చలాన్‌ కట్టకపోతే వెహికల్​ను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. వేగపరిమితుల్ని(స్పీడ్​ లిమిట్​) నిర్దేశించినప్పటికీ చాలామంది వాహనం నడిపే వారు వాటిని పాటించటం లేదని గుర్తించారు. దీంతో, కఠిన చర్యల అమలుకు ప్రభుత్వం సమాయత్తం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+